అత్యవసర సమయాల్లో రైలు ప్రయాణికులు సాధారణ రిజర్వేషన్ టిక్కెట్లు లభించనపుడు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఈ తత్కాల్ టిక్కెట్ కౌంటర్ ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది. అయితే, ఆన్‌లైన్‌లో తత్కాల్ విండో ఓపెన్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఈ టిక్కెట్లు ఖాళీ అవుతుంటాయి. అలాంటి సమయాల్లో తత్కాల్ విండో ఓపెన్ అయిన రెండు మూడు నిమిషాల్లోనే ఈ టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు కొన్నిపాటి జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
ముఖ్యంగా, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ముందుగానే లాగి అయివుండాలి. అందులో ప్రయాణికుల వివరాలను ఐఆర్సీటీసీలోని మాస్టర్ లిస్టులో ముందుగానే సేవ్ చేసుకునిపెట్టుకోవడం ద్వారా టైపింగ్ సమయం ఆదా అవుతుంది. డబ్బు చెల్లింపుల కోసం యూపీఐ లేదా ఐఆర్‌సీటీసీ వాలెట్‌ను ఉపయోగించడం ఉత్తమం. నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ లేదా క్రిడిట్ కార్డుల్లో చెల్లింపులను ఎంచుకుంటే మాత్రం సమయం పడుతుంది.