దేశంలోనే తొలిసారి ప్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ను హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ ఆవిష్కరించింది. హోండా సీబీ300ఎఫ్ పేరిట దీన్ని దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త హోండా ప్లెక్స్ ఫ్యూయల్ బైక్ బుకింగ్స్ కూడా ఇప్పటికే మార్కెట్‌లో ప్రారంభమైన విషయం తెల్సిందే. అక్టోబరు చివరి నుంచి హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లో ఈ బైక్స్‌ను అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే, ప్లెక్సీ ఫ్యూయల్ బైక్ అంటే ఏమిటి.. వీటి ధరలు, ఫీచర్లను ఓసారి తెలుసుకుందాం.
హోండా సీబీ300ఎఫ్ ప్లెక్స్ ఫ్యూయల్ ఫీచర్లను పరిశీలిస్తే, ఇంజిన్ 293.52 సీసీ, టార్క్ 25.6 ఎన్ఎఁ, కెర్బ్ వెయిట్ 153 కేజీలు, పవర్ 24.4 పీఎస్, మైలేజ్ 30 కిలోమీటర్ పర్ అవర్, డబుల్ డిస్క్ బ్రేకులు వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగివుంది.
హోండా సీబీ300ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కొత్త బైక్‌ను 293.52సీసీ, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ పీజీఎం-ఎఫ్‌ఐ ఇంజిన్‌తో తీసుకొచ్చారు. ఇది 18.3 kW పవర్, 25.9 టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 6- స్పీడ్ గేర్ బాక్స్, అసిస్టెంట్ స్లిప్ క్లచ్‌తో వస్తోంది. రెండు డిస్క్‌బ్రేక్‌లు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో దీన్ని తీసుకొచ్చారు. ఈ కొత్త హోండా సీబీ300ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర 1.70 లక్షలు (ఎక్స్- షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.
ఒకటి కంటే ఎక్కువ ఇంధన మిశ్రమాలను ఫ్లెక్స్ ఫ్యూయల్‌గా పిలుస్తారు. సాధారణంగా ఈ రకం మోటార్‌సైకిల్స్ పెట్రోల్ + ఇథనాల్ లేదా మిథనాల్‌తో నడుస్తాయి. ఈ రకం బైక్‌ను తీసుకురావడంపై కంపెనీ ఎండీ, సీఈఓ సుత్సుము ఒటాని హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ ప్రయాణంలో సరికొత్త మైలురాయి అని అన్నారు. ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఈ బైక్‌ను అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు.