Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పైసా ఖర్చు చేయకుండా ఐపోన్-7 కావాలా.. అయితే ఇలా చేయండి

కొత్త ఆపిల్‌ ఫోన్‌ వస్తోందంటే చాలు... స్టార్‌ హీరో సినిమాల రేంజులో దాని మీద అంచనాలు పెరిగిపోతుంటాయి. ఆప్షన్స్‌ ఏంటి, ధర ఎంత? అంటూ వూసులు మొదలైపోతాయి. అయితే తాజాగా యాపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా మార్కె

Advertiesment
Ukrainians
, సోమవారం, 24 అక్టోబరు 2016 (14:39 IST)
కొత్త ఆపిల్‌ ఫోన్‌ వస్తోందంటే చాలు... స్టార్‌ హీరో సినిమాల రేంజులో దాని మీద అంచనాలు పెరిగిపోతుంటాయి. ఆప్షన్స్‌ ఏంటి, ధర ఎంత? అంటూ వూసులు మొదలైపోతాయి. అయితే తాజాగా యాపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా మార్కెట్‌లో ఆవిష్కరించిన ఐఫోన్-7ని త‌మ సొంతం చేసుకోవాల‌ని ఎంతో మంది స్మార్ట్ ఫోన్ ప్రియులు ఆరాట‌పడుతుంటారు. అయితే, దాని ధ‌ర ఆకాశానికంటడంతో కొంద‌రికి అది అంద‌కుండానే పోతోంది. 
 
కాగా ఐఫోన్ 7 కోసం వేచిచూస్తున్న వినియోగదారులకు ఉక్రెయిన్‌లోనే అతిపెద్ద మొబైల్‌ రిటైల్‌ వెబ్‌సైట్‌లో ఒకటైన ''అల్లో.యూఏ'' ఓ శుభవార్తను అందించింది. అదేంటంటే... డబ్బులు లేకుండా ఐఫోన్‌-7ని ఉచితంగా దక్కించుకోవచ్చని ప్ర‌క‌టించింది. అయితే, అందుకో విచిత్ర‌మైన ష‌ర‌తును కూడా విధించింది. అందుకోసం వారు తమ పేరుని ఐఫోన్‌-7గా మార్చుకోవాల‌ట. ఈ ష‌ర‌తు ప్రకారం వినియోగ‌దారుడు త‌న‌ పేరుకు బదులుగా మొదటి పేరుని ఐఫోన్‌ అని, రెండో పేరుని 7 అని మార్చుకోవాలి. ఇందుకోసం పేరు మార్చుకున్న వ్య‌క్తి త‌న‌కు సర్కారు ఆమోదముద్రతో ఇచ్చిన ధ్రువీకరణ పత్రంతో సెల్ఫీ దిగి దాన్ని ''అల్లో.యూఏ'' సంస్థకు పంపించాలని సదరు సంస్థ సూచించింది.
 
త‌మ‌కు అలా పేరుమార్చుకొని పంపిన ద‌ర‌ఖాస్తుల్లో మొదట పంపిన‌ ఐదుగురిని విజేతలుగా వెబ్‌సైట్లో ప్ర‌క‌టించనుంది. విజేతలుగా నిలిచిన వారికి 32 జీబీ మెమరీ ఉండే ఐఫోన్‌-7 ఉచితంగా ఇవ్వనుంది. ఈ ఆఫర్ 2016 అక్టోబర్‌ 17 నుంచి వ‌చ్చే ఏడాది మార్చి 1 వరకు అందుబాటులో ఉంచుతున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది. ఫ్రీగా ఈ స్మార్టు ఫోనుని పొందాలంటే అందుకోసం ముందుగా ఉక్రెయిన్‌లోని స్థానిక రిజిస్ట్రారు కార్యాలయంలో ఆ ఫోను కావాల‌నుకుంటున్న వారు త‌మ‌ పేరుని మార్చుకోవాలి. ఇదండీ సంగతి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మణిపూర్ ముఖ్యమంత్రిగా తుపాకీ కాల్పులు.. తృటిలో త‌ప్పించుకున్న ఇబోబీసింగ్‌