Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హట్సన్ అగ్రో ప్రాడక్ట్ లిమిటెడ్ 3000వ అవుట్‪లెట్ ప్రారంభం

హట్సన్ అగ్రో ప్రాడక్ట్ లిమిటెడ్ 3000వ అవుట్‪లెట్ ప్రారంభం
, శుక్రవారం, 4 డిశెంబరు 2020 (22:28 IST)
భారతదేశ ప్రైవేట్ రంగ డెయిరీల్లో సారథ్య స్థానంలో వున్న కంపెనీ అయిన హట్సన్ అగ్రో ప్రాడక్ట్ ప్రై.లి. (హెచ్ఎపి), తన 3000వ హెచ్ఎపి డెయిరీ అవుట్‪లెట్‌ని ప్రారంభించింది. లక్షలాది మంది విశ్వసిస్తున్న, అత్యంత నాణ్యమైన పాల ఉత్పత్తులకి పేరుపొందిన హెచ్ఎపి డైలీ అనేది హట్సన్ అగ్రో ప్రాడక్ట్ లి. వారి రిటైల్ విభాగం, ఇది పాలు, పాల ఉత్పత్తులు, ఐస్ క్రీములని ఖాతాదారులకి సౌకర్యంగా అందిస్తుంటుంది.
 
హెచ్ఎపి వారి రిటైల్ తాత్వికత అయిన తాజాదనం, నాణ్యతలకి అనుగుణంగా, అన్ని హెచ్ఎపి డైలీ అవుట్‪లెట్లూ స్థిరమైన సేవలతో, ఉత్పత్తులని అందుబాటులో వుంచడంలో, మెరుగైన పరిసరాలతో సాటిలేని వినియోగదారు అనుభవాన్ని అందిస్తోంది. ఈ అవుట్‪లెట్‌ని సుశిక్షితులైన స్వతంత్ర ఫ్రాంచైజీలు నిర్వహిస్తుంటారు.
 
తన యావత్ అరుణ్ ఐస్ క్రీంల శ్రేణికితోడు, హెచ్ఎపి డైలీ అవుట్‪లెట్లు, ఎంపిక చేసిన ఇతర ఉత్పత్తుల్ని అంటే ఆరోగ్య పాలు, హట్సన్- పెరుగు, పనీర్, పాల పానీయం, యోగార్ట్ షేక్స్, నెయ్యి, వెన్న, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, డెయిరీ వైట్నర్‌లని రకరకాల మార్కెట్లలో రిటైల్‌గా అమ్ముతుంటుంది. వినియోగదారులకి అమ్మడంతోపాటు, హెచ్ఎపి డైలీ అవుట్‪లెట్లు, దగ్గర్లోని ఇతర రిటైల్ అవుట్‪లెట్ కికూడా తమ ఉత్పత్తుల్ని సరఫరా చేయడం, తద్వారా ఉత్పత్తుల్ని అందుబాటులో వుంచడాన్ని పెంచి, బ్రాండ్ రీచ్‌ని విస్తరిస్తుంటాయి. ఈ రిటైల్ అవుట్‪లెట్లు, ఫ్రాంచైజీలకి అద్భుతమైన ప్రగతి అవకాశాలని అందిస్తుంటాయి.
 
3000వ హెచ్ఎపి డైలీ అవుట్‪లెట్‌ని తెరిచిన సందర్భంగా శ్రీ. ఆర్.జి. చంద్రమోగన్, ఛైర్మన్, హట్సన్ అగ్రో ప్రాడక్ట్ లి. మాట్లాడుతూ, “మా ఉత్పత్తుల పోర్టుఫోలియో తాలూకు నాణ్యతని మా వినియోగదారులు విశ్వసించడంతో, హెచ్ఎపి డెయిరీ ఉత్పత్తులు మంచి డిమాండ్, పెరుగుదల చవిస్తూన్నాయి. ఈ రిటైల్ విస్తరణ అనేది హట్సన్ అగ్రో ప్రాడక్ట్ లి. ప్రగతి వ్యూహం, తన అత్యధిక నాణ్యత గల ఉత్పత్తులని విస్తృతస్థాయిలో ప్రజలకి దగ్గరగా తీసుకువెళ్ళాలనే లక్ష్యానికి అనుగుణంగానే జరుగుతోంది. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో రిటైల్ విస్తరణ హెచ్ఎపికి మంచి భావిసూచన, మహారాష్ట్రలోని సోలాపూర్‌లో కొత్త ప్లాంట్‌ని తెరబోతున్నందున దీని ఉత్పత్తి సామర్థ్యాలు ఆశిస్తున్న స్థాయిలో పెరుగుతాయి అన్నారు.
 
అత్యధిక నాణ్యత గలిగిన డెయిరీ ఉత్పత్తులని అందించడం ద్వారా దేశవ్యాప్తంగా అందరి ఇళ్ళకీ చేరాలన్న లక్ష్యంతో హెచ్ఎపి కృషిచేస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకుగాను, ప్రస్తుత, అలాగే కొత్త మార్కెట్లలోకి కూడా తన రిటైల్ ఉనికిని విస్తరించాలనే విషయంలో హెచ్ఎపి పూర్తిస్థాయిలో కట్టుబడివుంది”అని అన్నారు.
 
మరికొన్నాళ్ళలో, హెచ్ఎపి, తన మరిన్న హెచ్ఎపి డైలీ అవుట్‪లెట్లని కొత్త మార్కెట్లయిన మహారాష్ట్ర, కేరళ, ఒరిస్సా, ఛత్తీస్‪ఘడ్‌ల్లో ప్రారంభించడానికి, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, గోవాల్లో సాంప్రదాయికంగా బలంగావున్న మార్కెట్లలో తన ఉనికిని మరింత పెంచుకోడానికి కృతనిశ్చయంతో వుంది. భారతీయ డెయిరీ పరిశ్రమ రిటైల్ రంగాన్ని పూర్తిగా మార్చి, పురోగామిగా నిలవాల్న లక్ష్యంతో వుంది హెచ్ఎపి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేనానికి రాపాక మరోసారి కుతకుత, కొడుకుకి సీఎం జగన్ సమక్షంలో వైసిపి తీర్థం