జీఎస్టీకి వ్యతిరేకంగా 30న దక్షిణాది రాష్ట్రాల్లో హోటళ్ల బంద్
ఒకే దేశం.. ఒకే పన్ను విధానంలో భాగంగా జూలై నెల నుంచి జీఎస్టీ పన్ను విధానం దేశ వ్యాప్తంగా అమలు కానుంది. ఇందులో హోటల్ రంగంపై జీఎస్టీ విధానంలో పెంచారు. ఈ పన్ను శాతాన్ని తగ్గించాలని కోరుతూ మే 30న దక్షిణాద
ఒకే దేశం.. ఒకే పన్ను విధానంలో భాగంగా జూలై నెల నుంచి జీఎస్టీ పన్ను విధానం దేశ వ్యాప్తంగా అమలు కానుంది. ఇందులో హోటల్ రంగంపై జీఎస్టీ విధానంలో పెంచారు. ఈ పన్ను శాతాన్ని తగ్గించాలని కోరుతూ మే 30న దక్షిణాది రాష్ట్రాల్లో ఒక రోజు హోటళ్ల బంద్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోటళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముత్తవరపు శ్రీనివాసరావు తెలిపారు.
జీఎస్టీ విధానం ద్వారా నాన్ ఏసీ రెస్టారెంట్‌కు 12శాతం, ఏసీ రెస్టారెంట్‌కు 18శాతంగా పన్ను నిర్ణయించారన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతం, తమిళనాడులో 2 శాతం, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 0.5శాతం మాత్రమే పన్ను ఉందన్నారు. దీనిని ఒక్కసారిగా 18 శాతానికి పెంచి వినియోగదారుడిపై భారం మోపుతున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను శాతాన్ని తగ్గించాలని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబులకు విన్నవించినట్లు తెలిపారు.