Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగారు బిస్కెట్లుగా మారిన రూ.2700 కోట్ల నల్లధనం : లెక్కలు బయటపెట్టిన ఈడీ

దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటనతో నల్లకుబేరులు తమ వద్ద ఉన్న నల్ల ధనాన్ని బంగారు బిస్కెట్లుగా మార్చేశారు. నిజానికి ఈ నిర్ణయంతో అనేక మంది నల్లదొరలు అప్ప

Advertiesment
Gold
, ఆదివారం, 18 డిశెంబరు 2016 (14:41 IST)
దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటనతో నల్లకుబేరులు తమ వద్ద ఉన్న నల్ల ధనాన్ని బంగారు బిస్కెట్లుగా మార్చేశారు. నిజానికి ఈ నిర్ణయంతో అనేక మంది నల్లదొరలు అప్పనంగా దోచుకున్న సొమ్మంతా ఏం చేయాలో తెలియక కొందరు తగలబెట్టారు, ఇంకొందరు గంగలో కలిపారు. మరికొందరు దేవుడి ఖాతాల్లోకి (హుండీలు) మళ్లించారు. 
 
నవంబర్ 8వ తేదీ మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత కొందరు నల్ల దొంగలు తెలివిగా వ్యవహరించి కోట్ల రూపాయలకు బంగారం కొనుగోలు చేశారు. ఈ బంగారు బాబుల బాగోతాన్ని ఇపుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు బహిర్గతం చేశారు. 
 
ఒక్క హైదరాబాద్ నగరంలోనే నవంబరు 8 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు సుమారు 2700 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు బిస్కెట్లను కొనుగోలు చేశారని ఈడీ తేల్చింది. అలాగే, నల్ల కుబేరుల కోసం హైదరాబాద్‌లోని బంగారు వ్యాపారులు ఏకంగా 8 వేల కేజీల బంగారాన్ని దిగుమతి చేశారు. అంటే బడా బాబులను కాపాడటానికి జ్యూయలరీ షాపుల యాజమాన్యాలు ఎంతగా ప్రయత్నించాయో ఈ లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి. 
 
అంతేకాదు, డిసెంబర్ 1 నుంచి 10 వరకూ కూడా హైద్రాబాద్‌కు 15 వందల కేజీల బంగారం దిగుమతి అయినట్లు తేలింది. ఇపుడు ఈ బంగారు వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో బంగారు బిస్కెట్లను కొనుగోలు చేసిన నల్ల కుబేరులతో పాటు... బంగారు వ్యాపారుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లదొంగల అర్థరాత్రి స్వాతంత్ర్యం... సహకార బ్యాంకుల్లో రూ.9 వేల కోట్ల జమ