Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో మళ్ళీ షాకిచ్చిన బంగారం ధరలు

gold
, శుక్రవారం, 13 అక్టోబరు 2023 (13:15 IST)
దేశంలో బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కిపిస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధం తర్వాత ఈ ధరలు క్రమంగా పెరగసాగాయి. అయితే, గురువారం స్వల్పంగా తగ్గిన ఈ ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. తాజా లెక్కల ప్రకారం 10 గ్రాముల బంగారం ధరలో రూ.380 మేరకు పెరిగింది. అంటే గ్రాముకు రూ.38 చొప్పున పెరిగింది. 
 
ప్రస్తుతం దేసంలో 10 గ్రామాలు 24 గ్రాముల బంగారం ధర రూ.58,910గా ఉంది. గురువారం ఈ బంగారం ధర రూ.58,530గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. 22 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ.35 చొప్పునంది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.54,000కు చేరుకుంది. గురువారం ఈ బంగారం ధర రూ.53,650గా ఉంది. 
 
ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.5,400, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.5,891గా ఉంది. దీంతో బంగారం ప్రియులు పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీనికితోడు పండగ సీజన్ కావడంతో ఈ బంగారం ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు కుట్ర : చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేశ్