Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరుగెడుతున్న పసిడి ధర... రూ.40 వేలకు చేరుకునేనా?

పసిడి ధర మళ్లీ పరుగెత్తుతోంది. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు) ధర శనివారం ఒక దశలో రూ.30,175కు చేరింది. గురువారంతో పోలిస్తే ఇది రూ.325 ఎక్కువ. గత ఏడాది అక్టోబర్‌ 18 తర్వాత పసిడి ధర మళ

Advertiesment
పరుగెడుతున్న పసిడి ధర... రూ.40 వేలకు చేరుకునేనా?
, ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (15:09 IST)
పసిడి ధర మళ్లీ పరుగెత్తుతోంది. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు) ధర శనివారం ఒక దశలో రూ.30,175కు చేరింది. గురువారంతో పోలిస్తే ఇది రూ.325 ఎక్కువ. గత ఏడాది అక్టోబర్‌ 18 తర్వాత పసిడి ధర మళ్లీ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెండి ధరలు సైతం అదే దారిలో పయనిస్తూ కిలోకు రూ.43,800 దాటింది.
 
రూపాయితో డాలర్‌ మారకం రేటు తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్ పెరుగడంతోపాటు దేశీయంగా పెండ్లిళ్ల సీజన్ కొనుగోళ్లు పెరుగడం ఇందుకు కారణమైంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కేజీ సిల్వర్ రేటు రూ.600 పెరిగి రూ.43,800 వద్దకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరుగడంతో ధర పుంజుకుంది.
 
కాగా, ఈ వారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన నూతన ఆర్థిక విధానాన్ని ప్రకటించనుండటంతో, బులియన్ మార్కెట్ వర్గాలు అమెరికా వైపు చూస్తున్నాయి. బంగారం తదుపరి పయనాన్ని ట్రంప్ విధానాలు ప్రభావితం చేయవచ్చని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మినిట్స్ విడుదల చేసిన సంకేతాలు సైతం బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలను సూచిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్సీగా నారా లోకేష్.. ఆ తర్వాత ఏపీ కెబినెట్ మంత్రి కూడా?