అవును.. బంగారం ధర భారీగా తగ్గిపోయిందోచ్..

శుక్రవారం, 2 ఆగస్టు 2019 (11:18 IST)
మీరు చదువుతున్నది నిజమే. బంగారం ధర భారీగా తగ్గిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరపైకి వచ్చినా.. జువెలర్లు, రిటైర్ల నుంచి డిమాండ్ మందగించడంతో ధరపై ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా పసిడి ధర భారీగా తగ్గింది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.430 తగ్గుదలతో రూ.36,160కు క్షీణించింది.  అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.230 తగ్గుదలతో రూ.33,150కు క్షీణించింది. 
 
కానీ బంగారం ధర భారీగా పడిపోతే.. వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.44,965 వద్ద స్థిరంగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణమని వ్యాపార నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పోలవరంపై పులివెందుల పంచాయతీ : దేవినేని ఉమ