Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పడిపోతున్న పసిడి ధరలు - వారం రోజుల్లో రూ.2100 తగ్గుదల

Advertiesment
పడిపోతున్న పసిడి ధరలు - వారం రోజుల్లో రూ.2100 తగ్గుదల
, బుధవారం, 16 మార్చి 2022 (13:37 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆరంభంలో ఆకాశానికి తాగిన పసిడి ధరలు ఇపుడు మళ్లీ క్రమంగా తగ్గుతున్నాయి. దీనికి నిదర్శనమే గత వారం రోజుల్లో ఏకంగా 2100 రూపాయల మేరకు బంగారం ధర తగ్గింది. 
 
యుద్ధ విరమణ సమస్యపై ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య పలు దశల వారీగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచనున్న నేపథ్యంలో మదుపర్లు బంగారం నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగానే కాకుంగా దేశీయంగా కూడా పుత్తడి, వెండి ధరలు తగ్గుతున్నాయి. 
 
ఈ నెల 8వ తేదీ అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర గరిష్టంగా 2069 డాలర్లకు చేరింది. మంగళవారం సాయంత్రం ఇది 1915 డాలర్లకు క్షీణించింది. అలాగే, ఇక భారత బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర ఈ నెల 8వ తేదీన పది గ్రాముల బంగారం ధర రూ.55,100, కిలో వెండి ధర రూ.72,900గా ఉన్నాయి. కానీ వారం రోజులు తిరగకముందే అంటే మంగళవారం మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.53 వేలు ఉండగా, కిలో వెడి ధర రూ.69600గా ఉంది. అంటే రూ.2100 మేరకు తగ్గింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జోగిని శ్యామలకు వేధింపులు... ఆ వీడియోలు పంపడంతో..?