Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్ ఎకనమిస్ట్‌గా భారత మహిళ

Advertiesment
Gita Gopinath
, మంగళవారం, 8 జనవరి 2019 (13:46 IST)
అమెరికాలో నివశిస్తున్న భారత మహిళకు మరో అరుదైన గౌవరం దక్కింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో తొలి మహిళా చీఫ్ ఎకనమిస్ట్‌‌గా నియమితులయ్యారు. ఆమె పేరు గీతా గోపీనాథ్. తమిళనాడు వాసి. ప్రస్తుతం హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈమె ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 
 
ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో గీతా గోపీనాథ్ ఒకరుగా గుర్తింపు పొందారు. ఈమెను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టుగా నియమించుకుంటామని గత యేడాది అక్టోబరు ఒకటో తేదీన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లగార్డే ప్రకటించారు. ఆ ప్రకారంగా గీతా గోపీనాథ్‌ను చీఫ్ ఎకనమిస్టుగా నియమించారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, ఇలాంటి ఉన్నత పదవి దక్కడం అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం, సుంకాల పెంపు వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాళ్లుగా మారాయని, బహుళజాతి సంస్థలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంపూర్ణేష్ బాబు ''అరటిపండు'' ఫైట్‌కు ఇండోనేషియా ఫ్యాన్స్ ఫిదా (వీడియో)