Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గెలాక్సీ ఏ26 5జిని భారతదేశంలో కేవలం రూ. 22999 ప్రారంభ ధరతో విడుదల చేసిన సామ్‌సంగ్

Advertiesment
Galaxy A26 5G

ఐవీఆర్

, గురువారం, 27 మార్చి 2025 (21:11 IST)
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, ఏఐ శక్తితో కూడిన తమ అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏ 26 5జి ని విడుదల చేయటం ద్వారా ఏఐ ప్రతి ఒక్కరికి చేరువ చేసే తీరును మరింతగా పునర్నిర్వచిస్తోంది. సౌకర్యవంతమైన అనుభవం అందించటం కోసం రూపొందించబడిన గెలాక్సీ ఏ 26 5జి  శైలి, మన్నిక, పనితీరు మరియు ఆవిష్కరణల సమతుల్యతను అందిస్తుంది, ఇది రోజువారీ ఉపయోగం కోసం సరైన ఎంపికగా మారుతుంది.
 
అద్భుతమైన మేధస్సు 
గెలాక్సీ ఏ 26 5జి కి అద్భుతమైన మేధస్సును సామ్‌సంగ్ తీసుకువస్తుంది, ఇది రోజువారీ పనులను మరింత తెలివిగా, సులభంగా చేస్తుంది. ఇంటెలిజెంట్ ఏఐ సూట్, గూగుల్‌తో సర్కిల్ టు సెర్చ్ విత్, ఏఐ సెలెక్ట్, ఆబ్జెక్ట్ ఎరేజర్, మై ఫిల్టర్స్ మరియు మరిన్ని వంటి ఫీచర్లతో వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
 
గత సంవత్సరం గెలాక్సీ ఏ సిరీస్ పరికరాల్లో అభిమానులకు ఇష్టమైన సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్- ఇప్పుడు కేవలం చిత్రాలకు మించి, వినియోగదారులు పాటలను గుర్తించడానికి, సమాచారాన్ని కనుగొనడానికి, కనీస ప్రయత్నంతో తక్షణ చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తుంది. తాజా ఆధునీకరణలతో, వినియోగదారులు ఇప్పుడు తమ ఫోన్‌లో మరిన్ని చేయవచ్చు. గూగుల్‌తో సర్కిల్ టు సెర్చ్‌తో ఫోన్ నంబర్‌లు, ఇమెయిల్ చిరునామాలు, యుఆర్ఎల్ లను స్క్రీన్‌పై త్వరగా గుర్తిస్తుంది, తద్వారా వినియోగదారులు కనీస ప్రయత్నంతో చర్యలు తీసుకోవచ్చు.
 
గెలాక్సీ ఏ 265జి కూడా ఆబ్జెక్ట్ ఎరేజర్‌తో వస్తుంది, ఇది ఫోటోల నుండి అవాంఛిత అంశాలను తొలగించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వినియోగదారులు తుడిచివేయడానికి ఆ అంశాలను మాన్యువల్‌గా లేదా స్వయంచాలకంగా ఎంచుకోవచ్చు, కేవలం కొన్ని ట్యాప్‌లతో స్వచ్ఛమైన , మరింత మెరుగుపెట్టిన తుది చిత్రాన్ని సాధించవచ్చు.
 
ఏఐ సెలెక్ట్ ఒకే క్లిక్‌తో తక్షణ శోధన మరియు సమాచారాన్ని సంగ్రహించడం ద్వారా సందర్భాన్ని సహజంగా  అర్థం చేసుకుంటుంది. వినియోగదారులు తమ వ్యక్తిగతీకరించిన ఫిల్టర్‌లను సృష్టించడానికి మై ఫిల్టర్స్ వీలు కల్పిస్తాయి. ఈ వినూత్న ఫంక్షన్ వినియోగదారులు తమ రంగులు మరియు శైలులను అనుకరించడం ద్వారా, వాటిని కొత్త చిత్రాలకు తక్షణమే వర్తింపజేయడం ద్వారా తాము ఇష్టపడే ఫోటోల రూపాన్ని, అనుభూతిని ఒడిసిపట్టటానికి అనుమతిస్తుంది. ప్రతి కస్టమ్ ఫిల్టర్ భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో సులభంగా పొందడం  కోసం కెమెరా యాప్‌లో సౌకర్యవంతంగా సేవ్ చేయబడుతుంది, ఇది మరింత వ్యక్తిగతీకరించిన, సృజనాత్మక ఫోటోగ్రఫీ అనుభవాన్ని అనుమతిస్తుంది. ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్లున్నాయి.
 
అందుబాటులో ఉన్న ధర వద్ద ప్రీమియం అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిన గెలాక్సీ ఏ 26 5జి నేటి నుండి సామ్‌సంగ్ ఎక్స్క్లూజివ్   స్టోర్‌లు, ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్‌లలో రూ. 22999 అద్భుతమైన ధరకు అందుబాటులో ఉంది. గెలాక్సీ ఏ 26 5జి 8జిబి RAMతో రెండు స్టోరేజ్ అవకాశాలలో వస్తుంది- 128GB మరియు 256GB, రెండూ మైక్రో SD ద్వారా 2TB వరకు విస్తరించదగినవి, అన్ని కంటెంట్‌కు తగినంత స్థలాన్ని అందిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..