దేశవ్యాప్తంగా పలు నగరాలైనటువంటి చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి, హోసూర్, మైసూర్, బల్లారి లలో రియల్ ఎస్టేట్ రంగ పరంగా అపూర్వ విజయాన్ని సాధించిన జీ స్క్వేర్ హౌసింగ్ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సత్తా చాటడానికి పూర్తిగా సన్నద్ధమైంది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రమోటర్‌గా ఖ్యాతి గడించిన జీ స్క్వేర్ హౌసింగ్ ఇప్పుడు తెలంగాణాలో కూడా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లను చేపట్టింది. హైదరాబాద్‌లో రాబోతున్న ప్రాజెక్ట్‌లు నాగార్జున సాగర్ రోడ్‌లో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న బీఎన్ రెడ్డి నగర్ తో పాటుగా త్వరలో ప్రారంభంకానున్న మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్‌కు అతి సమీపంలో ఉన్న షాద్‌నగర్‌లో ఉంది.
రియల్ ఎస్టేట్ రంగాన్ని లోతుగా అర్థం చేసుకున్న సంస్ధ జీ స్క్వేర్ హౌసింగ్. అత్యున్నత స్ధాయిలో వినియోగదారులకు సంతృప్తిని అందిస్తూ ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టులెన్నింటినో ఇది విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పటి వరకూ వీరు 60 ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను పూర్తి చేశారు.
దాదాపు 4500కు పైగా వినియోగదారులు సంస్ధకు ఉండటంతో పాటుగా ఈ సంఖ్య స్ధిరంగా వృద్ధి చెందుతుంది. దక్షిణ భారతదేశంలో దాదాపు 1000 ఎకరాల భూమిని వీరు తమ వినియోగదారులకు అభివృద్ధి చేసి అందించారు. ఇప్పుడు తెలంగాణాలో సైతం జీ స్క్వేర్ హౌసింగ్ తమ ప్రీమియం ప్రాజెక్ట్‌లను అందించడానికి సిద్ధమైంది. ప్లాటెడ్ కమ్యూనిటీలోని సభ్యులందరూ ప్రపంచ శ్రేణి వసతులను, అవసరమైన మౌలిక సదుపాయాలతో పొందగలరు. జీ స్క్వేర్ హౌసింగ్ తమ వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభవాలను 100% క్లియర్ డాక్యుమెంటేషన్, ఐదు సంవత్సరాల ఉచిత మెయిన్‌టెనెన్స్‌తో అందిస్తుంది. వీరి ప్రాజెక్టులన్నీ కూడా నివాస, వాణిజ్య ప్లాట్స్‌గా ఉండి తక్షణమే నిర్మాణాలు చేపట్టడానికి అనువుగా ఉంటాయి. ప్లాట్స్ విక్రయంతో పాటుగా జీ స్క్వేర్ హౌసింగ్ ఇప్పుడు నిర్మాణం కోసం కొనుగోలు అనంతర మార్గనిర్దేశనం సైతం చేయనుంది.
జీ స్క్వేర్ హౌసింగ్ సీఈఓ ఈశ్వర్ ఎన్ మాట్లాడుతూ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించడం పట్ల పూర్తి సంతోషంగా ఉన్నాము. జీ స్క్వేర్ హౌసింగ్ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్‌గా ఉండటంతో పాటుగా తమిళనాడు, కర్నాటకలలో ఆరు నగరాలలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్ కోసం మేము భారీ ప్రణాళికలను చేశాము. ఈ ఆర్ధిక సంవత్సరం కోసం మా అతిపెద్ద జోన్స్‌లో ఒకటిగా ఇది ఉండనుంది అని అంచనా వేస్తున్నాముఅని అన్నారు.