Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘దీపావళి షాపోత్సవ్’ 2023ని ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్

Advertiesment
Flipkart
, శుక్రవారం, 27 అక్టోబరు 2023 (20:51 IST)
భారతదేశంలో స్వదేశీయంగా అభివృద్ధి చెందిన ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ యొక్క డిజిటల్ B2B ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్లిప్‌కార్ట్  హోల్‌సేల్, ఈరోజు తమ B2B సభ్యుల కోసం దీపావళి షాపోత్సవ్‌ను అక్టోబర్ 25 నుండి నవంబర్ 12, 2023 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 'బోలో ఫైదే కి బోలి' అనే ట్యాగ్‌లైన్‌తో జరిగే ఈ వార్షిక విక్రయం మొత్తం 26 స్టోర్‌లలో అలాగే ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.
 
తమ ట్యాగ్‌లైన్‌కు అనుగుణంగా, దీపావళి షాపోత్సవ్ విభిన్న విభాగాలలో ఈ సీజన్‌లో అతిపెద్ద డీల్‌లను వేడుక చేసుకుంటుంది. ఈ సంవత్సరం, గృహ&వంటగది ఉపకరణాలు, బహుమతి మరియు పండుగ అలంకరణ వస్తువులు వంటి  కొత్తగా ప్రారంభించబడిన కేటగిరీలపై ప్రత్యేక దృష్టి సారించింది. పండుగ ఉల్లాసాన్ని మరింత పెంచేందుకు, రోజువారీ ఫ్లాష్ డీల్‌లు ప్లాన్ చేయబడ్డాయి, ఇందులో బ్రాండ్‌లు సభ్యులకు 2 కిలోల చక్కెర మరియు అనేక ఇతర వస్తువులను Re.1 వద్ద అందిస్తాయి! అదనంగా, కిరాణా  సభ్యులు లక్కీ డ్రా ఆఫర్‌లో భాగంగా సరికొత్త మహీంద్రా థార్, మొబైల్ ఫోన్‌లు, బంగారం మరియు వెండి నాణేలతో సహా అద్భుతమైన బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంటుంది.
 
సేల్‌లో భాగంగా, సభ్యులు తమ ఆన్‌లైన్ ఛానెల్‌లో పండుగ స్పెషల్ డీల్స్, ఫ్లాష్ డీల్స్, పాకెట్ ఫ్రెండ్లీ డీల్స్, బ్లాక్ బస్టర్ డీల్స్ మరియు మరిన్నింటి వంటి ఆకర్షణీయమైన ఆఫర్‌ల ద్వారా వివిధ ప్రయోజనాలను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ యొక్క బలమైన సాంకేతికత మరియు సప్లై చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పై ఆధారపడి , ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ కిరణాలు మరియు MSMEల వృద్ధికి మరియు మొత్తం పర్యావరణ వ్యవస్థ యొక్క  అభివృద్ధిని సులభతరం చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీటీడీలో ఉద్యోగాలు.. మొత్తం 56 పోస్టుల భర్తీ