టెస్లా ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు... ధర రూ.కోటి
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు భారత్‌కు వచ్చింది. మహారాష్ట్రలోని జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్‌లో ఈ కారు లాండ్ అయ్యింది.
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు భారత్‌కు వచ్చింది. మహారాష్ట్రలోని జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్‌లో ఈ కారు లాండ్ అయ్యింది. దీని అసలు ధర రూ.55 లక్షలు కాగా, కస్టమ్స్, ఇతర డ్యూటీ పన్నులు కలుపుకుంటే కారు ధర రూ.కోటికి పైగా పలుకనుంది.
ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. వీటిని ఒక్కసారి చార్జ్ చేసినట్టయితే ఏకంగా 435 కిలోమీటర్ల మేరకు చుట్టిరావొచ్చు. అలాగే, లోపలి భాగం ఎంతో విశాలంగా తయారు చేశారు. అలాగే, వెనుక సీట్లో కూర్చొన్నవారిక కోసం ఎల్.సి.డి టీవీలను కూడా ఏర్పాటు చేశారు.