ఆసియాలో అతిపెద్ద హెల్మెట్ తయారీసంస్థ కావడంతో పాటుగా అంతర్జాతీయంగా సరఫరా కాబడుతున్న భారతీయ బ్రాండ్ స్టీల్‌బర్డ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పంపిణీ నెట్‌వర్క్‌తో పాటుగా తయారీ సామర్థ్యం, అత్యున్నత నాణ్యత మరియు అందుబాటు శ్రేణి హెల్మెట్‌లపై ఆధారపడి భారతీయ తయారీదారు మరియు ఎఫ్‌ఐఏలు తమ అంతర్జాతీయ రోడ్ భద్రతా కార్యక్రమం కోసం భాగస్వామ్యం చేసుకున్నాయి. ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం, ఎఫ్‌ఏఐ సభ్య క్లబ్స్ అంతర్జాతీయ నెట్‌వర్క్‌కు మద్దతునందించడంతో పాటుగా ఆ ప్రాంతాలలో యునైటెడ్ నేషన్స్ రెగ్యులేషన్ 22.05కు తగినట్లుగా అత్యున్నత నాణ్యత కలిగిన హెల్మెట్లను అందించడం.
ఈ కార్యక్రమం కోసం స్టీల్‌బర్డ్ సంవత్సరానికి 2,40,000 హెల్మెట్లను తయారుచేస్తుంది. మొత్తం భాగస్వాములందరూ కలిపి సంవత్సరానికి 4,20,000 హెల్మెట్లను తయారుచేస్తారు.
యుఎన్ సేఫ్టీ ప్రమాణాలను అందుకునే రీతిలో మోటర్‌సైకిల్ హెల్మెట్ తయారు చేసేలా తగిన సదుపాయాలను అందించడంపై ఎఫ్‌ఏఐ కృషి చేస్తుంది. ఈ హెల్మెట్‌లు వేడి మరియు తేమ వాతావరణంలో సైతం మెరుగైన ప్రదర్శన అందించడంతో పాటుగా 20 యుఎస్‌డీ లోపు ధరలోనే ఇవి విక్రయించాలన్నది లక్ష్యం. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, అత్యంత ప్రభావవంతమైన రోడ్డు భద్రతా జోక్యంలలో హెల్మెట్ ధారణ ఒకటి. దాదాపు 44% మంది మోపెడ్ రైడర్లు, మోటర్‌సైకిలిస్ట్‌ల తలకు గాయాలు కాకుండా ఇది కాపాడుతుంది.
ఎఫ్‌ఐఏ సేఫ్ అండ్ అఫర్డబుల్ హెల్మెట్ ఇనీషియేటివ్‌లో భాగంగా హెల్మెట్‌తయారీదారునితో చేసుకున్న రెండవ ఒప్పందం ఇది. ఈ ప్రాజెక్ట్ ఇటీవలనే కీప్ ఫైటింగ్ ఫౌండేషన్ మద్దతు అందుకుంది.
ఎఫ్‌ఐఏ అధ్యక్షులు జీన్ టోడ్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతకు సంబంధించి అత్యంత కీలకాంశం హెల్మెట్ ధారణ. మా సురక్షిత,అందుబాటు ధరలలోని హెల్మెట్ కార్యక్రమానికి నూతన భాగస్వామిగా స్టీల్ బర్డ్ రావడం పట్ల సంతోషంగా ఉన్నాము. అత్యున్నత నాణ్యత కలిగిన హెల్మెట్‌లను అందుబాటు ధరలలో సరఫరా చేసేందుకు స్టీల్‌బర్డ్ కట్టుబడి ఉంది.. అని అన్నారు.
స్టీల్‌బర్డ్ హెల్మెట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరాజీవ్ కపూర్ మాట్లాడుతూ, ఎఫ్‌ఐఏతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల గర్వంగా ఉన్నాము. ఈ భాగస్వామ్యంతో రోడ్డు భద్రతా ప్రమాణాల పట్ల అతి తక్కువ అవగాహన కలిగిన ప్రాంతాలలో భద్రతా చర్యలు తీసుకోవడం వీలవుతుంది. ఓ బ్రాండ్‌గా కేవలం మా పంపిణీ నెట్‌వర్క్ నిర్మించుకోవడంపై మాత్రమే కాదు, రైడర్లకు నాణ్యత మరియు భద్రతను అందించడంపై తీవ్రంగా కృషి చేస్తున్నాం అని అన్నారు.