Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివకార్తికేయన్ చేతుల మీదగా ప్రారంభమైన ఫ్యాన్లీ ఎంటర్‌టైన్‌మెంట్

Advertiesment
sivakarthikeyan

ఐవీఆర్

, మంగళవారం, 2 డిశెంబరు 2025 (20:38 IST)
ఫ్యాన్లీ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క విప్లవాత్మక వినోద వేదిక ఫ్యాన్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో భారతీయ నటుడు-నిర్మాత శ్రీ శివకార్తికేయన్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ నేషనల్ కోచ్-పద్మభూషణ్ శ్రీ పుల్లెల గోపీచంద్, ప్రపంచ చెస్ ఛాంపియన్-మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత శ్రీ గుకేష్, ఉబెర్ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రీ మణికందన్ తంగరత్నంలు ఫ్యాన్లీ సహ వ్యవస్థాపకులు శరవణన్ కనగరాజు మరియు శ్రీనివాసన్ బాబులతో కలిసి ప్రారంభించారు.
 
ఫ్యాన్లీ అనేది స్టార్లు, వారి అభిమానులు సంభాషించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చే మొట్టమొదటి, ఏకీకృత అభిమానుల అనుసంధానిత యాప్.  అగ్రశ్రేణి తారలు, ఉత్సాహవంతులైన అభిమానులను ఒకేచోట ఫ్యాన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ చేర్చనుంది. శివకార్తికేయన్‌ అధికారికంగా తమ వేదిక పైకి రావటం పట్ల సంతోషంగా ఉన్నాము. త్వరలోనే మరింత మంది స్టార్లు రాబోతున్నారు. అభిమానులు ఫ్యాన్లీని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని ఫ్యాన్లీ వ్యవస్థాపకులు శరవణన్ కనగరాజు, శ్రీనివాసన్ బాబు తెలిపారు. వారే మాట్లాడుతూ, భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న వినోద రూపాలలో సినిమా ఒకటి. అయినప్పటికీ కమ్యూనిటీని నిజంగా అనుసంధానించే డిజిటల్ ప్రాంగణం లేదు. ఫ్యాన్లీతో, అభిమానులు పరిశ్రమ మరియు దాని స్టార్‌లతో సంభాషించే అపూర్వమైన అవకాశాన్ని పొందుతారు అని అన్నారు. 
 
శివకార్తికేయన్ మాట్లాడుతూ, కుటుంబానికి పర్యాయపదం, ఫ్యాన్లీ. అభిమానులతో స్నేహపూర్వకంగా సంభాషించడానికి ఇది సానుకూల వాతావరణాన్ని తెస్తుందని భావిస్తున్నాను అని అన్నారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ శ్రీ గుకేష్ దొమ్మరాజు మాట్లాడుతూ, ప్రతికూలత, సమాచార దాడి లేని కొత్త రకమైన సోషల్ మీడియా ఫ్యాన్లీ అవుతుందని నేను భావిస్తున్నాను అని అన్నారు.
 
పద్మ భూషణ్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ నేషనల్ కోచ్ శ్రీ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, ఫ్యాన్లీలో రోల్ మోడల్స్ పంచుకునేది పిల్లలకు అమూల్యమైనది. తమ రోల్ మోడల్స్‌లా ఉండాలని కలలు కనడానికి సహాయపడుతుంది అని అన్నారు. ఉబెర్ సీనియర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ శ్రీ మణికందన్ తంగరత్నం మాట్లాడుతూ, ఫ్యాన్లీ అనేది అభిమానులను, ప్రముఖులను ఒకచోట చేర్చే వేదిక. ఒక అభిమాని ఒక ఆలోచనను పంచుకున్నప్పుడు, సెలబ్రిటీ తిరిగి స్పందించినప్పుడు అభిమానులు ఎంత ఆనందాన్ని పొందుతారో ఊహించుకోండి అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి