Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టమాటాకు పోటీగా ఉల్లి ధర.. ఆగస్టు నెలాఖరవరకు ఇదే పరిస్థితి

దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ధర ఇప్పటికే సెంచరీ కొట్టింది. తాజాగా ఉల్లిపాయల ధర కూడా టమాటాకు పోటీగా పెరుగుతోంది. ఈ రెండు కూరగాయలధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

టమాటాకు పోటీగా ఉల్లి ధర.. ఆగస్టు నెలాఖరవరకు ఇదే పరిస్థితి
, శనివారం, 29 జులై 2017 (15:13 IST)
దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ధర ఇప్పటికే సెంచరీ కొట్టింది. తాజాగా ఉల్లిపాయల ధర కూడా టమాటాకు పోటీగా పెరుగుతోంది. ఈ రెండు కూరగాయలధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా టమాటా ధరలు కొండెక్కి కూర్చొన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా దేశంలోని 17 పట్టణాల్లో టమాటా ధరలు గరిష్ట స్థాయిలోనే విక్రయమవుతున్నాయి. వీటిలో రాజధాని ఢిల్లీతోపాటు కోల్‌కతా, ఇండోర్, తిరువనంతపురం, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు తదితర ప్రాంతాలు ఉన్నాయి. 
 
ఢిల్లీలో మూడు నెలల క్రితం రూ.26 ఉన్న టమాటా ఇప్పుడు రూ.92కు చేరింది. చెన్నైలో ఏప్రిల్ - జూలై మధ్య కాలంలో టమాటా ధరలు ఐదు రెట్లు పెరగడం గమనార్హం. అటు బెంగళూరులోనూ ఆరు రెట్లు పెరిగింది. వర్షాలు, వరదల కారణంగా పంట దెబ్బతినడంతో ఇప్పటికిప్పుడు సరఫరా పరిస్థితులు మెరుగపడే అవకాశాల్లేవని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆగస్ట్ చివరి వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
 
ఇదిలావుంటే, ఇన్నాళ్లు చల్లగా ఉన్న ఉల్లి ధర కూడా క్రమంగా పై వైపునకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్రలోని లాసల్‌గాన్‌లో క్వింటాలు ఉల్లిగడ్డల ధర రూ.1,300కు చేరింది. ఇది 19 నెలల గరిష్ట ధర. గతంలో రోజుకు 25,000 క్వింటాళ్ల సరుకు రాగా, ప్రస్తుతం అది 12,000 క్వింటాళ్లకు తగ్గుముఖంపట్టడమే ఈ ధరల పెరుగుదలకు కారణంగా ఉంది. 
 
తాజాగా ఉల్లిసాగు లేదని, ప్రస్తుతం వస్తున్న పంట అంతా మార్చి, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో దిగుబడి అయిందని, స్టోరేజీల నుంచి వాటిని బయటకు తీస్తున్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, చాలా మంది రైతులు ఇప్పటికే తమ పంటను అమ్మేసుకున్నట్టు చెబుతున్నారు. అంటే ఉన్న పంట అంతా వ్యాపారుల దగ్గరకు చేరినట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అట్లాంటిక్ సముద్రంపై ప్రసవం... ప్రయాణికులను ముందుకు పంపి.. వెనుక కానిచ్చేశారు..