Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతదేశపు మొట్టమొదటి డయాబెటిక్‌ ఫుట్‌- పొడియాట్రి ఇనిస్టిట్యూట్‌ను చెన్నైలో ప్రారంభించిన డాక్టర్‌ ఆర్‌కె

photo
, శుక్రవారం, 6 జనవరి 2023 (17:35 IST)
భారతదేశంలో ప్రీమియర్‌ డయాబెటిక్‌ ఫుట్‌ కేర్‌ ఫెసిలిటీలో ఒకటైన డాక్టర్‌ ఆర్‌కె డయాబెటిక్‌ ఫుట్‌ అండ్‌ పొడియాట్రీ ఇనిస్టిట్యూట్‌, రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా అంపుటేషన్‌ ప్రివెన్షన్‌ సెంటర్‌ నేడు అధికారికంగా చెన్నైలోని కొలథూర్‌ వద్ద భారతదేశపు మొట్టమొదటి డయాబెటిక్‌ ఫుట్‌ అండ్‌ పొడియాట్రీ ఫెసిలిటీ ప్రారంభించింది. ఈ అత్యాధునిక సదుపాయంలో ఉన్న గెయిట్‌ ఎనాలిసిస్‌ ల్యాబ్‌ను గౌరవనీయ చారిటబల్‌ ఎండోమెంట్స్‌ శాఖామాత్యులు శ్రీ పీ కె శేఖర్‌ బాబు ప్రారంభించారు.


దివంగత శ్రీ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా విగ్రహాన్ని శ్రీమతి రేఖా ఝున్‌ఝున్‌వాలా ఆవిష్కరించడంతో పాటుగా హైపర్‌ బేరిక్‌ ఆక్సిజన్‌ థెరఫీ (హెచ్‌బీఓటీ), ఆపరేషన్‌ థియేటర్‌, ఐసీయు కాంప్లెక్స్‌లను సైతం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఆర్‌కె డయాబెటిక్‌ ఫుట్‌ అండ్‌ పొడియాట్రీ ఇనిస్టిట్యూట్‌, రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా అంపుటేషన్‌ ప్రివెన్షన్‌ సెంటర్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేష్‌ కేశవన్‌, ఇతర అతిరథులు పాల్గొన్నారు.
 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని శ్రీమతి రేఖా ఝున్‌ఝున్‌వాలా అందించారు. ఆమె మాట్లాడుతూ, ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో గొప్ప ఇనిస్టిట్యూట్‌లు మా వారి పాదాలను తొలగించాల్సిందేనని, అది తప్ప వేరే మార్గం లేదని వెల్లడించిన తరువాత డాక్టర్‌ రాజేష్‌ కేశవన్‌ రావడంతో పాటుగా మా వారి పాదాలను తొలగించాల్సిన అవసరం లేకుండానే నయం చేశారు. భారతీయ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్‌ కేశవన్‌. మరీముఖ్యంగా డయాబెటిక్‌ ఫుట్‌ కేర్‌ రంగంలో ఆయన ప్రతిభ అనన్య సామాన్యం. ఈ ప్రపంచ శ్రేణి చికిత్స ప్రతి భారతీయునికీ చేరువ కావాలని మావారు తపించారు.
 
అందువల్లనే, మేము డాక్టర్‌ కేశవన్‌కు మద్దతు అందించడంతో పాటుగా ఆయనతో చేతులు కలిపి ఈ ప్రపంచ శ్రేణి ఇనిస్టిట్యూట్‌ను మరే భారతీయుడూ డయాబెటిక్‌ ఫుట్‌ చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చాటి చెప్పే రీతిలో ప్రారంభించాము. డాక్టర్‌ కేశవన్‌కు మద్దతు అందిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా వారి ఆశయాలు, కలలను సాకారం చేసేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారతదేశంలో డయాబెటిక్‌ ఫుట్‌ కేర్‌‌లో గణనీయమైన మార్పులను ఏవిధంగా సాంకేతికత తీసుకువస్తుందనేది ఆయన చూపుతున్నారు’’ అని అన్నారు.
 
ఈ వినూత్న కేంద్రం గురించి డాక్టర్‌ ఆర్‌కె డయాబెటిక్‌ ఫుట్‌ అండ్‌ పొడియాట్రీ ఇనిస్టిట్యూట్‌ వ్యవస్ధాపకులు డాక్టర్‌ రాజేష్‌ కేశవన్‌ మాట్లాడుతూ, ‘‘ఫుట్‌ మరియు పొడియాట్రిక్‌ కేర్‌ అనే పదం ప్రత్యేకమైన వైద్య చికిత్సను సూచిస్తుంది. పొడియాట్రిస్ట్‌, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సహా సుశిక్షితులైన నిపుణులతో కూడిన బృందం మాత్రమే ఈ తరహా సేవలను అందించగలదు. మా వినూత్నమైన కేంద్రంలో అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించే సదుపాయాలు ఉన్నాయి. సౌకర్యవంతమైన, సమగ్రమైన డయాబెటిక్‌ ఫుట్‌ కేర్‌ చికిత్సను ఇక్కడ అందించగలము’’ అని అన్నారు.
 
ఈ వినూత్న కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే, ప్రపంచ శ్రేణి ఫుట్‌ కేర్‌ చికిత్సను భారతదేశంలో కేవలం డయాబెటిక్‌ రోగులకు మాత్రమే అందించడం కాకుండా, ఈ డయాబెటిక్‌ ఫుట్‌  స్థితి పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, ముందుగానే వ్యాధి తీవ్రతను గుర్తించడం ద్వారా వైకల్యం నిరోధించడం. దాదాపు ప్రతి 7 సెకన్లనూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట ఓ అవయవం తొలగించడం జరుగుతుంది. భారతదేశంలో దాదాపు 6 కోట్ల మందికి పైగా మధుమేహరోగులు ఉన్నారు. 
 
వీరిలో చాలామందికి పాదాలలో స్పర్శ కూడా ఉండటం లేదు. వారి పాదాలకయ్యే చిన్న గాయం కూడా అతి సులభంగా ఇన్‌ఫెక్షన్‌కు గురి చేసి వారి అవయవాలు  తొలగించే స్ధితికి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ప్రభావిత వ్యక్తులు పూర్తిగా తమ కుటుంబ సభ్యులపై తమ సాధారణ కార్యక్రమాల కోసం కూడా ఆధారపడవలసి రావొచ్చు. దీని కారణంగా వారు తమ కలలు, గౌరవం, ఆత్మవిశ్వాసం అన్నీ కోల్పోవచ్చు. డాక్టర్‌ ఆర్కే ఇనిస్టిట్యూట్‌ వ్యాధిగ్రస్తుల గాయాలను శారీరకంగా మాత్రమే  కాదు మానసికంగానూ నయం చేసేందుకు ప్రయత్నిస్తుంది, వారు కోల్పోయిన చిరునవ్వు, ప్రశాంతత, స్వతంత్య్ర జీవితాన్ని సైతం తిరిగి వారికి బహుమతిగా అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ జగన్.. ప్రజలు తలచుకుంటే గుడ్డలూడదీసి నిలబెడతారు.. పోలీసులా..? దొంగలా? : చంద్రబాబు