కేంద్ర ఆర్థిక శాఖ అంతర్గతంగా జారీచేసిన ఓ లేఖ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఒక యేడాది పాటు నెలలో ఒక రోజు వేతనాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలన్నది ఈ లేఖ సారాంశం. దీన్ని కొందరు ఉద్యోగులు పాజిటివ్‌గా తీసుకోగా, మరికొందరు నెగెటివ్‌గా తీసుకుంటున్నారు. ఫలితంగానే ఈ అంతర్గాతంగా చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ విషయం ఏమిటంటే... కరోనా విపత్తు నేపథ్యంలో పీఎం-కేర్స్‌కు పలువురు దాతలు విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అదేసయయంలో అన్ని విభాగాల ఉద్యోగులు తమవంతు సాయం ప్రకటిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆర్థిక శాఖ ఈ అంతర్గత సర్క్యులర్‌ను జారీచేసింది.
'ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉద్యోగులంతా ఏడాదిపాటు ప్రతినెలా ఒకరోజు విరాళాన్ని పీఎం-కేర్స్‌కు అందించి సహకరించాలి' అన్నది ఆ సర్క్యులర్ సారాంశం. దేశం కోసమే కదా అని పలువురు ఈ విజ్ఞప్తికి మద్దతు తెలియజేస్తుండగా, ఏడాదిపాటు ఎలా సాధ్యమవుతుందని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
ఏపీలో విశ్రాంత ఉద్యోగుల పింఛన్‌లో కోత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగుల పింఛన్‌లో 50 శాతం కోత విధిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీని సోమవారం హైకోర్టు తొలి కేసుగా విచారించింది. ఆసమయంలో లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పింఛన్‌లో 50 శాతం కోత విధించి, పరిస్థితి చక్కబడిన తర్వాత చెల్లిస్తానని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అయితే పెన్షనర్లకు అదే ఆధారమని, వారి పింఛన్‌లో కోత అన్యాయమంటూ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని సోమవారం విచారించిన కోర్టు మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.