Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంకకు అంబానీ భార్య ప్రయాణం.. ఎందుకంటే.. కప్పులు, శాసర్లు కోసం?

శ్రీలంకకు అంబానీ భార్య ప్రయాణం.. ఎందుకంటే.. కప్పులు, శాసర్లు కోసం?
, శుక్రవారం, 6 ఆగస్టు 2021 (17:43 IST)
శ్రీలంకకు అంబానీ భార్య ప్రయాణం అయ్యారు. ఎందుకంటే.. కప్పులు, శాసర్లు షాపింగ్ కోసం ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం.. బకింగ్‌హామ్ ప్యాలెస్. దాని తర్వాతి కాస్ట్రీ బిల్డింగ్ అంటే ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీదే.

40 అంతస్తుల్లో 170 కార్లతో ఉండే విలాసవంతమైన భవనం అది. ఆ (యాంటిల్లా) అని పిలిచే ఇంట్లో పెట్టుకోవడానికి కొన్ని సామాన్లు కొనడం కోసం ఆమె శ్రీలంకకు వెళ్లివచ్చారట. అక్కడ కాస్త ఖరీదు తక్కువగా కొనుగోలు చేయొచ్చునని ఆమె ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించి మరీ తీసుకొచ్చారు.
 
యాంటిల్లా భవనంలో వంట సామాను కోసమే కాకుండా దీపావళి కానుకలు ఇచ్చేందుకు కూడా షాపింగ్ చేశారట నీతా అంబానీ. జపనీస్ బ్రాండ్ అయాని Noritakeకు చెందిన వస్తువుల కోసం అక్కడకు వెళ్లారు. Noritake పేరుతో ఉండే గ్రామంలో తయారుచేసిన వస్తువులు దశాబ్దాల క్రితమే అమెరికాకు చేరుకున్నాయి.
 
హోటల్ గ్రూపుల్లో, ఎయిర్ లైన్స్‌లో, ప్రైవేట్ హోమ్స్‌లో ఈ బ్రాండ్ చాలా సార్లు కనిపిస్తుంది. ప్రపంచంలోనే ఫ్యామస్ అయినటువంటి బ్రాండ్ కోసం.. బడా బాబులు వేల డాలర్లు ఈజీగా ఖర్చుపెట్టేస్తుంటారట. ఇవి ఇండియాలో దొరికే వస్తువులే అయినా వీటి కోసం నీతా అంబానీ శ్రీలంకకు ఎగిరి 1500కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అక్కడి నుంచి మొత్తం 25వేల వస్తువులు పట్టుకొచ్చారు.
 
అంత దూరం ప్రయాణించడానికి కారణం శ్రీలంకలో ధర తక్కువగా వుంటాయట. 22 క్యారెట్ గోల్డ్‌తో ఉండే వీటి ధర ఇండియాలో 800డాలర్ల నుంచి 2వేల డాలర్లు ఉంటుంది. అదే శ్రీలంకలో అయితే 300డాలర్ల నుంచి 500డాలర్లకే వచ్చేస్తాయి. విమాన ఇంధనానికి అయ్యే ఖర్చుతో లెక్కేసి చూసినా కూడా ఆమె ప్రయాణం చేసిన షాపింగ్‌కు అక్కడికి వెళ్లడం కారణంగానే తక్కువ ధరకు వచ్చాయని చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీబీఎస్‌ఈ టెన్త్ పరీక్షల్లో 90%కు పైగా స్కోర్‌ను సాధించిన 8 మంది ఏపి తిరుపతి ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులు