Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆన్‌లైన్ మోసాలపై ఖాతాదారులకు పూర్తి రక్షణ.. పది రోజుల్లో ఖాతాలో జమ

ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాలు, కార్డుల నుంచి జరిగే అనధికార ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల మోసాలపై మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఇకపై రూపాయి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదు. ఈ దిశగా ఆర్‌బీఐ గురువారం స్పష్టతనిచ్చింది. మూడు రోజుల్లోపు ఫిర్య

ఆన్‌లైన్ మోసాలపై ఖాతాదారులకు పూర్తి రక్షణ.. పది రోజుల్లో ఖాతాలో జమ
హైదరాబాద్ , శుక్రవారం, 7 జులై 2017 (05:37 IST)
తమ ఖాతాలు, కార్డుల నుంచి అనధికారిక లావాదేవీలు జరుగుతున్నాయంటూ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాలు, కార్డుల నుంచి జరిగే అనధికార ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల మోసాలపై మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఇకపై రూపాయి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదు. ఈ దిశగా ఆర్‌బీఐ గురువారం స్పష్టతనిచ్చింది. మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే పది దినాల్లోగా సదరు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. బీమా పరిహారం కోసం ఆలస్యం చేయడం ఉండదని స్పష్టం చేసింది. 
 
మూడో పార్టీ చేసిన మోసపూరిత లావాదేవీలపై నాలుగు నుంచి ఏడు దినాల్లోపు రిపోర్ట్‌ చేస్తే రూ.25,000 వరకు నష్టానికి ఖాతాదారుడే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.  ఖాతాదారుడి నిర్లక్ష్యం వల్ల మోసం జరిగితే, దానిపై బ్యాంకుకు ఫిర్యాదు చేసే వరకూ చోటుచేసుకునే నష్టం ఏదైనా గానీ దాన్ని ఖాతాదారుడే భరించాల్సి ఉంటుందని తెలిపింది. ఖాతాదారుడు అనధికార లావాదేవీపై బ్యాంకుకు సమాచారం ఇచ్చిన తర్వాత చోటు చేసుకునే నష్టం ఏదైనా బ్యాంకే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. 
 
‘‘ఖాతాదారుడు వైపు నుంచి, బ్యాంకు వైపు నుంచి లోపం లేకుండా, వ్యవస్థలో ఎక్కడో లోపం కారణంగా మూడో పక్షం చేసిన ఉల్లంఘనపై ఖాతాదారుడికి ఎటువంటి బాధ్యత లేదు. అయినప్పటికీ అనధికార లావాదేవీ గురించి ఖాతాదారుడు మూడురోజుల్లోపే బ్యాంకుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్లక్ష్యం, లోపం, సాయం కారణంగా అనధికారిక లావాదేవీ చోటు చేసుకుంటే, ఖాతాదారుడు దానిపై సమాచారం ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ విషయంలోనూ అతడికి ఎటువంటి బాధ్యత ఉండదు’’ అని ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది. 
 
మోసంపై ఏడు రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే దానిపై ఖాతాదారుల బాధ్యత ఎంత మేరకు అన్నది బ్యాంకుల బోర్డు విధానం మేరకు నిర్ణయించడం జరుగుతుందని  ఆర్‌బీఐ వివరించింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్లక్ష్యమే జయలలిత మృతికి ప్రధాన కారణం.. బాంబు పేల్చిన నటరాజన్