కోస్టా కాఫీ పారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్‌లో అధికారిక కాఫీ భాగస్వామి అయినందుకు చాలా ఉత్సాహంగా ఉంది, కాఫీ సంస్కృతిని ప్రోత్సహించడంలో, ప్రపంచవ్యాప్తంగా భారతీయ బారిస్టాలకు ఒక కేంద్ర వేదికను అందించడంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఆరు దేశాలకు చెందిన 130 కోస్టా కాఫీ టీమ్ సభ్యులు ఆరు కియోస్క్‌లు, 110 కంటే ఎక్కువ సెల్ఫ్-సర్వ్ పాక్టో మెషీన్‌లను ఉపయోగించి ప్యారిస్ అంతటా ఏడు ప్రదేశాలలో ప్రేక్షకులు, ఆటగాళ్లకు అత్యుత్తమ వేడి మరియు చల్లటి పానీయాల అనుభవాలను అందిస్తారు.
ఈ భాగస్వామ్యంలో భాగంగా, కోస్టా కాఫీ మూడు అద్భుతమైన భారతీయ బారిస్టాలు: అమీర్ ఫయీజ్, మల్లికా త్రిపుర మరియు అభిషేక్ కుమార్ ను పరిచయం చేసింది. ఈ ప్రతిభావంతులైన వ్యక్తులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి మరియు కోస్టా కాఫీ యొక్క టీమ్‌వర్క్ మరియు ఎక్సలెన్స్ విలువలను అందించచడానికి కఠినమైన శిక్షణ పొందారు. టీమ్ సభ్యులు ఈ సైట్ సజావుగా కొనసాగేట్లు చూస్తారు. అథ్లెట్లు మరియు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కాఫీ మాస్టర్‌క్లాస్‌లను హోస్ట్ చేస్తారు. కోస్టా కాఫీ టీమ్‌లోని ఎంపిక చేసిన సభ్యులు ఒలింపిక్ క్రీడల సమయంలో టార్చ్‌ని తీసుకెళ్లే అద్భుతమైన అవకాశాన్ని కలిగి ఉంటారు, ఇది గేమ్‌ల చుట్టూ ఉన్న ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది.
మిస్టర్ వినయ్ నాయర్, జనరల్ మేనేజర్, ఇండియా & ఎమర్జింగ్ ఇంటర్నేషనల్. కోస్టా కాఫీ, కోకా-కోలా ఇలా వ్యాఖ్యానించారు, పారిస్ 2024 ఒలింపిక్ క్రీడలకు అధికారిక కాఫీ భాగస్వామిగా ఉంటున్నందుకు మేము చాలా గర్విస్తున్నాము. ఈ అవకాశం ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికపై మన భారతీయ బారిస్టాస్ నైపుణ్యాలు మరియు సృజనాత్మకతను ప్రదర్శించడమే కాకుండా, మా ప్రతిబావంతులైన జట్టు సభ్యుల పట్ల మా అంకితభావాన్ని కూడా ప్రదర్శిస్తుంది. శ్రేష్ఠత పట్ల వారి నిబద్ధతకు మేము రివారును అందజేస్తున్నాము, సమగ్రమైన సంస్కృతిని పెంపొందించాము మరియు ఈ అద్భుతమైన అవకాశాన్ని వారికి ఇవ్వడం ద్వారా వారి పురోగతిలో పెట్టుబడి పెట్టాము.”
2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనేందుకు మన భారతీయ బారిస్టాల ప్రయాణం అమూల్యమైన అనుభవాలు మరియు లోతైన అనుబంధాలను జోడించే పరివర్తన ప్రయాణం.