Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఫామ్‌లో వివరాలన్నీ పొందుపరిస్తేనే కొత్త నోట్లు ఇస్తారు.. గుర్తింపు కార్డు తప్పనిసరి

పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇపుడు స్వదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంతో నల్ల దొంగలకు ముచ్చ

ఆ ఫామ్‌లో వివరాలన్నీ పొందుపరిస్తేనే కొత్త నోట్లు ఇస్తారు.. గుర్తింపు కార్డు తప్పనిసరి
, బుధవారం, 9 నవంబరు 2016 (15:23 IST)
పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇపుడు స్వదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంతో నల్ల దొంగలకు ముచ్చెమటలు పట్టిస్తుంటే.. ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఈ నోట్ల రద్దుపై ప్రధాని మోడీ ప్రకటన చేయగానే... మంగళవారం అర్థరాత్రి నుంచి ప్రజలు ఏటీఎం సెంటర్ల దగ్గర బారులు తీరారు. ఇదిలావుంటే, పాత నోట్లు మార్చుకునేందుకు డిసెంబర్ 30 వరకూ గడువిచ్చారు. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. ఇందుకోసం డిమానిస్ట్రేషన్ ఫామ్ ఇదేనంటూ నెట్‌లో ఓ ఫోటో వైరల్ అవుతోంది.
 
అందులో ఉన్న వివరాల ప్రకారం, పాతవి రూ.500, రూ.1000 నోట్లు ఎన్ని ఉన్నాయని డినామినేషన్, బ్యాంకు పేరు, బ్రాంచ్ తదితర ఖాళీలను నింపాల్సి ఉంటుంది. కొత్త నోట్లను పొందాలంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్డ్, పాన్ కార్డ్... వీటిల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ నింపిన ఫామ్‌‌తో పాటు పాత నోట్లను బ్యాంకులో అధికారులకు ఇస్తే తిరిగి కొత్త నోట్లను ఇస్తారని తెలిసింది.
 
మరోవైపు కొత్త నోట్లకు సంబంధించి ఓ రూమర్ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. నల్లధన నియంత్రణకు కొత్త నోట్లలో చిన్న చిప్‌ను ప్రవేశపెడుతున్నట్లు కొన్ని వార్తలొచ్చాయి. ఈ చిప్ వల్ల ఫేక్ కరెన్సీ చలామణీని అరికట్టొచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కొత్తగా వస్తున్న 2 వేల రూపాయల నోటులో ఎలాంటి చిప్‌ లేదని ఆర్‌బీఐ ప్రకటించింది. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్.. ఒకే ఒక్క నినాదంతో అమెరికా అధ్యక్షుడయ్యాడు.. హిల్లరీ 85 నినాదాలు వృధా.. ఎందుకని?