Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఇది బడ్జెట్ కాదు... అకౌంట్ ఫర్ ఓట్స్' : చిదంబరం సెటైర్లు

'ఇది బడ్జెట్ కాదు... అకౌంట్ ఫర్ ఓట్స్' : చిదంబరం సెటైర్లు
, శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (20:25 IST)
కేంద్ర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పందించారు. ఇది బడ్జెట్ కాదనీ, అకౌంట్ ఫర్ ఓట్స్ అంటూ ఎద్దేవా చేశారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ముఖ్యంగా, 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన' చారిత్రక నిర్ణయమని వ్యాఖ్యానించారు. 
 
యేటా రూ.6 వేల సాయంతో రైతుల కష్టాలు తీరుతాయని...ఆదాయం కూడా రెట్టింపవుతుందన్నారు. చెబుతున్నారు. ఏసీ గదుల్లో ఉండేవారికి రైతుల కష్టాలు పట్టవని.. అన్నదాతల సమస్యలు తమకు తెలుసని అందుకే చారిత్మక నిర్ణయం తీసుకున్నామని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం కేంద్ర రైతు బంధు పథకంపై సెటైర్లు వేస్తున్నారు. ఈ పథకంతో రోజుకు రూ.17 మాత్రమే రైతులకు వస్తాయని.. ఆ మాత్రం డబ్బులతోనే రైతులు బాగపడతారా? అని మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం ఎద్దేవా చేశారు. 
 
'ఇది ఓట్ ఆన్అకౌంట్ బడ్జెట్ కాదు. అకౌంట్ ఫర్ ఓట్స్. రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తామని చెప్పారు. అంటే రోజుకు రూ.17 మాత్రమే. ఈ డబ్బులతోనే రైతులు బాగుపడతారా? 17 రూపాయలు ప్రకటించడమంటే రైతులను అవమానించడమే. రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో డబ్బులు అకౌంట్లో వేస్తామంటున్నారు. మార్చి లోపు తొలి విడత డబ్బులు రైతులకు అందబోతున్నాయి. అంటే ఎన్నికల ముందు ఓటుకు రూ.2వేలు ఇస్తున్నారన్నమాట. ఈ బడ్జెట్‌లో రెండు పదాలు మిస్ అయ్యాయి. విద్య, ఉద్యోగాల ప్రస్తావనే లేదు. విద్యార్థులు, యువతను కేంద్రం మోసం చేసిందని చిదంబరం వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పన్ను మినహాయింపులో మతలబు... పన్ను పరిమితి దాటితే బాదుడే...