విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (వీపీటీ) వద్దనున్న బీఓటీ ఆపరేటర్లు, నౌకాశ్రయ రంగంలో తక్షణమే సంస్కరణలను నౌకాశ్రయ మౌలిక వసతులను వినియోగించడం కోసం చేయాల్సిందిగా షిప్పింగ్ మంత్రివర్యులు శ్రీ సర్బనంద సోనోవాల్‌ను డిమాండ్ చేశారు. సరైన విధాన సంస్కరణలు లేకపోతే ఈ బోఓటీ ఆపరేటర్లు, వీపీటీ వృద్ధిలో భాగం కాలేరు. నౌకాశ్రయ మౌలిక వసతులను సమర్థవంతంగా వినియోగించక పోవడం వల్ల నిరర్థక ఆస్తులుగా మారిపోయే ప్రమాదమూ ఉంది.
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ యొక్క (వీపీటీ) మూడు రాయితీ ఒప్పందాలను 6.5 ఎంటీపీఏ సామర్థ్యం కలిగిన అదానీ యొక్క స్టీమ్ కోల్ హ్యాండ్లింగ్ టర్మినల్; 7.5 ఎంటీపీఏ సామర్థ్యం కలిగిన ఎస్‌ఈడబ్ల్యు యొక్క స్టీమ్ కోల్ హ్యాండ్లింగ్ మరియు 6ఎంటీపీఏ సామర్థ్యం కలిగిన అల్బ్సా కార్గో హ్యాండ్లింగ్ సదుపాయాలు దాదాపు 2500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పుడు వీపీటీ మరియు నౌకాయాన మంత్రిత్వశాఖ నుంచి తగిన మద్దతు విధానాలు లేక ఆగిపోయాయి. అంతేకాదు, రాయితీ ఒప్పందాలలోని పలు అవరోధాలు కారణంగా మరో ఆరుగురు గుత్తేదారులు సైతం ఇప్పుడు వీపీటీతో పోరాటం చేస్తున్నారు.
వీపీటీ ఇప్పుడు కేవలం 0.7% వార్షిక వృద్ధి రేటు మాత్రమే నమోదు చేస్తుండగా, విశాఖపట్నంలోనే ఉన్న గంగవరం పోర్ట్ లిమిటెడ్ 10.5% వృద్ధి నమోదు చేస్తుంది. దీనికి ప్రధానకారణం టారిఫ్ అథారిటీ ఫర్ మేజర్ పోర్ట్స్ నియంత్రణలో జీపీఎల్ లేకపోవడం కారణం. జీపీఎల్ యొక్క ధరల కారణంగా వీపీటీలో పలు సంస్థలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ వీపీటీ నిబంధనలను మాత్రమే వల్లిస్తూ తక్షణ పరిష్కారాలను కనుగొనే దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.
గత దశాబ్ద కాలంలో భారతదేశ వ్యాప్తంగా నౌకా రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను భారత ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. భారతదేశంలో ప్రస్తుతం 36 పీపీపీ ప్రాజెక్టులు భారతదేశ వ్యాప్తంగా ప్రధాన నౌకాశ్రయాలలో 358 ఎంటీపీఏ సామర్థ్యంతో నిర్వహించబడుతున్నాయి. అదే రీతిలో 16 పీపీపీ ప్రాజెక్టులు పలు దశలలో అమలులో ఉన్నాయి.
దేశ వాణిజ్య, వర్తక వృద్ధిలో నౌకారంగ పరిశ్రమ ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం మారిటైమ్ ఇండియా విజన్ 2030ను తీసుకువచ్చి మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే గుత్తేదారులకు, రాయితీ మంజూరు చేసే అధికారుల నడుమ వివాదాలను అడ్డుకోవడానికి పోర్టు పాలసీలలో సంస్కరణలు తీసుకురావాల్సి ఉంది.