Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

BFSI కాంక్లేవ్ 2023: సమ్మిళిత వృద్ధి కోసం ఆవిష్కరణలు

image
, సోమవారం, 4 డిశెంబరు 2023 (17:03 IST)
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (IMT), హైదరాబాద్, BFSI కన్సార్టియం సహకారంతో "ఇన్‌క్లూజివ్ గ్రోత్ కోసం ఇన్నోవేషన్స్" అనే నేపథ్యంతో  BFSI కాన్‌క్లేవ్ యొక్క మొదటి ఎడిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. భారతదేశం 2027 నాటికి 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడానికి సిద్ధంగా ఉంది. దీనికి  ప్రభావవంతమైన ఆవిష్కరణలను చేయాల్సి ఉంటుందని కాన్క్లేవ్ నొక్కిచెప్పింది. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (మనీలా), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ, బంధన్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు సక్‌సీడ్ ఇన్నోవేషన్ ఫండ్ ప్రతినిధులతో సహా ప్రముఖ వక్తలు మరియు ప్రతినిధులు తమ పరిజ్ఞానం  మరియు వ్యూహాలను మార్పిడి చేసుకోవడానికి సమావేశమయ్యారు.
 
IMT హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ శ్రీహర్ష రెడ్డి కె, IMT తరపున అందరికీ స్వాగతం పలికారు. శ్రీ రాజేష్ బాలరాజు, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్, కోర్ గ్రూప్ సభ్యుడు BFSI కాన్క్లేవ్, అందరినీ ఉద్దేశించి ప్రసంగించారు. IMT హైదరాబాద్‌లోని BFSI కాన్‌క్లేవ్ చైర్ ప్రొఫెసర్ (డా.) శరత్ బాబు, సమ్మేళనం థీమ్ - ఇన్‌క్లూజివ్ గ్రోత్ కోసం ఆవిష్కరణలు గురించి చర్చించారు. డిజిటల్‌ ఫైనాన్స్‌ వల్ల క్రెడిట్‌ తీసుకోవడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. సమ్మిళిత బ్యాంకింగ్ ఆవశ్యకతను ఆయన ఎత్తిచూపారు.
 
మనీలాలోని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ సెక్టార్ స్పెషలిస్ట్ శ్రీ అరూప్ ఛటర్జీ- ఫైనాన్షియల్ మార్కెట్‌లు మరియు ఇన్సూరెన్స్ సెక్టార్‌లో వాతావరణ చర్యలను ఏకీకృతం చేయడం గురించి మాట్లాడారు.  భారీ మరియు క్యాపిటలైజ్ చేయబడిన కంపెనీలు గ్రీన్ టెక్‌కి సులభంగా ఎలా మారగలవో చెబుతూనే , తక్కువ-ఆదాయ కుటుంబాలు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. 
 
కార్యక్రమం లో  IMT హైదరాబాద్‌లోని అకడమిక్స్ డీన్, V.C. ప్రొఫెసర్ (డా.)  చక్రపాణి, ఉత్సాహ పూరితమైన ఫైర్‌సైడ్ చాట్‌ను నిర్వహించారు. గౌరవనీయ అతిథి డాక్టర్. సుభాష్ చంద్ర ఖుంటియా, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఛైర్మన్ మరియు మాజీ IRDAI ఛైర్మన్‌తో కలిసి చేసిన  ఈ సంభాషణ గ్రామీణ మరియు పట్టణ భారతదేశంలో బీమా వ్యాప్తి గురించి తగిన అవగాహన అందించింది . 
 
బంధన్ బ్యాంక్ మరియు IMT హైదరాబాద్‌లోని బోర్డ్ మెంబర్ శ్రీ. శాంతను ముఖర్జీ, సమ్మిళిత బ్యాంకింగ్ ఆవిష్కరణలపై చర్చను నిర్వహించారు. భారతదేశాన్ని చైనాతో పోల్చుతూ MSMEల యొక్క GDP ప్రభావాన్ని ఆయన నొక్కి చెప్పారు. బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రతన్ కుమార్ కేష్, సమ్మిళితతను  ప్రోత్సహించడంలో బ్యాంకింగ్ యొక్క చారిత్రక మరియు ప్రస్తుత పాత్రపై చెప్పారు. యాక్సిస్ బ్యాంక్ EVP & హెడ్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంకింగ్ శ్రీ  అపూర్వ సహిజ్వానీ, ఆర్థిక చేరికలో మ్యూచువల్ ఫండ్స్ మరియు బాండ్ మార్కెట్‌ల ప్రాముఖ్యత గురించి చర్చించారు.
 
తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ యర్రం రాజు, రుణాలు ఇచ్చే సంస్థలలో విశ్వాసం మరియు విధేయత మరియు ఆర్థిక చేరికలో MSMEల కీలక పాత్రను హైలైట్ చేశారు. సక్‌సీడ్ ఇండోవేషన్ ఫండ్ సహ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ పార్టనర్ శ్రీ విక్రాంత్ వర్ష్నే సాంప్రదాయ బ్యాంకింగ్‌ను సమూలంగా మార్చడంలో ఫిన్‌టెక్ యొక్క పరివర్తన పాత్రను నొక్కి చెప్పారు.  శ్రీ వెంకట్ చంగవల్లి, CEO, IIBI, సలహా మండలి, IRDAI. మాట్లాడుతూ ఇన్‌క్లూజివ్ ఇన్సూరెన్స్ కోసం ఇన్నోవేషన్స్ గురించి ర్చించారు. భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సమీకృత ప్రయత్నాలు కీలకమని, ఈ తరహా కార్యక్రమాలు  కార్యాచరణ చర్చలు మరియు సమగ్ర పరివర్తనకు వేదికను అందిస్తాయని ఈ కార్యక్రమం లో వక్తలు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీక సోమవారం.. నదీ స్నానాలకు వెళ్లి ఇద్దరు మహిళల మృతి