Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నోట్లపై రాయవద్దన్నామే కానీ, రాస్తే తీసుకోవద్దని అనలేదే.. ఆర్బీఐ వివరణ

చూసి రమ్మని చెబితే కాల్చి వచ్చే బాపతులో మన బ్యాంకు అధికారులను చేర్చవచ్చు. ఆర్బీఐ బ్యాంకుల సిబ్బందికి ఒకరకం ఆదేశాలు జారీ చేస్తే సిబ్బంది వాటిని మరొకరకంగా అర్థం చేసుకుని అమలు చేస్తే సామాన్యుడికి నరకం తప్పదు కదా. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా జారీ చే

నోట్లపై రాయవద్దన్నామే కానీ, రాస్తే తీసుకోవద్దని అనలేదే.. ఆర్బీఐ వివరణ
హైదరాబాద్ , ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (07:28 IST)
చూసి రమ్మని చెబితే కాల్చి వచ్చే బాపతులో మన బ్యాంకు అధికారులను చేర్చవచ్చు. ఆర్బీఐ బ్యాంకుల సిబ్బందికి ఒకరకం ఆదేశాలు జారీ చేస్తే సిబ్బంది వాటిని మరొకరకంగా అర్థం చేసుకుని అమలు చేస్తే సామాన్యుడికి నరకం తప్పదు కదా. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా జారీ చేసిన రూ. 2,000, 500 నోట్లపై ఏదైనా రాతలు రాస్తే వాటిని తీసుకోమని బ్యాంకు సిబ్బంది చెప్పడమే కాకుండా దాన్ని అమలు చేయడంతో జనం మామూలు బాధలు పడలేదు. తీరా చూస్తే రిజర్వ్ బ్యాంకు అలాంటి ఆదేశాలు వేటినీ బ్యాంకులకు జారీ చేయలేదట. సిబ్బంది అత్యుత్సాహం, ఓవరాక్షన్ కారణంగానే ఆర్బీఐ ఆదేశాలివ్వకపోయినా రాసిన నోట్లను తీసుకోకుండా సమస్యలు సృష్టించారు.
 
తాజా సమాచారం ఏమిటంటే.. కరెన్సీ నోట్లు రంగు వెలిసినా, వాటిపై రాతలు ఉన్నా బ్యాంకులు వాటిని తీసుకోవాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. అలాంటి నోట్లను ‘మాసిన నోట్లు’గా పరిగణించి ‘స్వచ్ఛ నోటు విధానం’ ప్రకారం వ్యవహరించాలని పేర్కొంది. కరెన్సీ నోట్లను.. ముఖ్యంగా రాతలున్న రూ.500, రూ.2,000 నోట్లను బ్యాంకు స్వీకరించడం లేదని ఫిర్యాదులు రావడంతో ఆర్‌బీఐ ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
 
రాతలున్న నోట్లను బ్యాంకులు 2017 నుంచి స్వీకరించబోవన్న వదంతులను కొట్టిపారేస్తూ తాను 2013లో జారీ చేసిన ప్రకటనను ఆర్బీఐ ఈ సందర్భంగా ప్రస్తావించింది. నోట్లపై రాయకూడదని బ్యాంకు సిబ్బందికి ఆదేశాలిచ్చామని పేర్కొంది. నోట్లను స్వచ్ఛంగా ఉంచేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆర్‌బీఐ కోరింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్డు ప్రమాదంలో యాంకర్ దుర్మరణం... నటుడు సేఫ్...