Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంపన్న ఇన్వెస్టర్ల కోసం ఎలీట్ ప్లస్ సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించిన బంధన్ బ్యాంక్

Advertiesment
image

ఐవీఆర్

, మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (21:46 IST)
దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న బంధన్ బ్యాంక్, కొత్తగా సంపన్న కస్టమర్లకు మరింత మెరుగైన బ్యాంకింగ్ అనుభూతిని అందించేలా రూపొందించబడిన ఎలీట్ ప్లస్ సేవింగ్స్ అకౌంటును ఆవిష్కరించింది. ఇందులో ప్రీమియం ఎలీట్ ప్లస్ డెబిట్ కార్డ్, ప్రత్యేకమైన లైఫ్‌స్టైల్ ప్రయోజనాలతో పాటు పలు ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. బంధన్ బ్యాంక్ ఈడీ- సీబీవో శ్రీ రాజీందర్ కుమార్ బబ్బర్, ఈడీ & సీవోవో శ్రీ రతన్ కుమార్ కేశ్ సమక్షంలో ఎండీ & సీఈవో శ్రీ పార్థ ప్రతిమ్ సేన్‌గుప్తా ఈ ప్రోడక్టును ఆవిష్కరించారు. భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ శ్రీ సౌరవ్ గంగూలీ ఈ ప్రోడక్టు తొలి ఖాతాదారుల్లో ఒకరిగా చేరారు.
 
ఎలీట్ ప్లస్‌తో ఖాతాదారులు ప్రతి నెలా ఉచితంగా అపరిమిత నగదు డిపాజిట్లతో పాటు ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ, ఐఎంపీఎస్‌ లావాదేవీలను ఉచితంగా పొందవచ్చు. ఎలీట్ ప్లస్ అకౌంటుతో మరిన్ని రివార్డు పాయింట్లు, ప్రతి త్రైమాసికంలో రెండు కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్‌లను పొందవచ్చు. ప్రతి నెలా రూ. 750 విలువ చేసే కాంప్లిమెంటరీ మూవీ టికెట్లు, భారతదేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన నిర్దిష్ట గోల్ఫ్ క్లబ్‌లలో ప్రీమియం గోల్ఫ్ సెషన్లకు ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్‌లాంటి ప్రయోజనాలను అందుకోవచ్చు. అలాగే, రూ. 15 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా, రూ. 3 లక్షల వరకు పర్చేజ్ ప్రొటెక్షన్‌తో కూడుకున్న మెరుగైన డెబిట్ ఇన్సూరెన్స్ కవరేజీ సహా ఎక్స్‌క్లూజివ్ వోచర్లు, మైల్‌స్టోన్ ఆఫర్లను కూడా ఎలీట్ ప్లస్ కస్టమర్లు పొందవచ్చు.
 
“మా ప్రీమియం కస్టమర్లకు అసమానమైన సౌలభ్యం, రివార్డులు, ఎక్స్‌క్లూజివ్ ప్రయోజనాలను అందించడం ద్వారా వారి అవసరాలకు తగిన విధంగా ఈ అకౌంట్ ఉపయోగపడుతుందని మేము విశ్వసిస్తున్నాం. లగ్జరీ ట్రావెల్ ప్రయోజనాల నుంచి ఎక్స్‌క్లూజివ్ బీమా కవరేజీ వరకు ఎలీట్ ప్లస్ సేవింగ్స్ అకౌంట్, ఖాతాదారులకు మరింత మెరుగైన అనుభూతిని అందించగలదు” అని బంధన్ బ్యాంక్ ఎండీ & సీఈవో శ్రీ పార్థ ప్రతిమ్ సేన్‌గుప్తా తెలిపారు. ఎలీట్ ప్లస్ సేవింగ్స్ అకౌంటు ఆవిష్కరణతో పాటు హెచ్ఎన్‌ఐ కస్టమర్లకు మరిన్ని అదనపు ప్రయోజనాలను చేకూర్చే ఫీచర్లతో బంధన్ ఎలీట్ సేవింగ్స్ అకౌంటును కూడా బ్యాంకు తిరిగి ప్రవేశపెట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్