Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్కెట్లోకి బజాజ్‌ ఆటో నుంచి సీటీ125ఎక్స్‌

Advertiesment
Bajaj CT125X
, శనివారం, 27 ఆగస్టు 2022 (12:26 IST)
Bajaj CT125X
బజాజ్‌ ఆటో నుంచి సీటీ125ఎక్స్‌ మార్కెట్లోకి వచ్చింది. రోజులో అధిక సమయం వాహనాన్ని నడపడంతో పాటు, బరువులు తీసుకెళ్లేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 
 
ముఖ్యంగా ఇ-కామర్స్‌ డెలివరీ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది' అని బజాజ్‌ వెల్లడించింది. సీటీ125 ఎక్స్‌ డ్రమ్‌ వేరియంట్‌ రూ.71,534కు, డిస్క్‌ రకం రూ.74,554 (ఎక్స్‌షోరూం)కు లభించనుంది.
 
125cc మోటార్‌సైకిళ్ల విభాగం భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందింది. భారతదేశంలో లక్ష రూపాయల కంటే తక్కువ ధరకు ఇది అందుబాటులో వుంది. 
 
సీటీ 125ఎక్స్‌లో ట్యూబ్‌లెస్ టైర్లు, ఫోర్క్ గైటర్స్, అల్లాయ్ వీల్స్ ఉంటాయి. దీని సీట్ TM ఫోమ్‌తో కూడిన క్విల్టెడ్ ప్యాటర్న్‌తో డిజైన్ చేశారు. 
 
ఈ బైక్ ఫ్రంట్ టైర్ 80/100 పరిమాణం, వెనుక టైర్ 100/90 పరిమాణంతో 17 అంగుళాల సైజ్‌లో ఉంటాయి. ఈ బైక్ ధర రూ.71,354 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
 
బజాజ్ లాంచ్ చేస్తున్న అన్ని కొత్త బైక్‌లో 124.4 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్ కూల్డ్‌తో కూడిన 4 స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. వీటికి అదనంగా బజాజ్ DTS-i టెక్నాలజీ, SOHC సెటప్‌ కూడా ఉండనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనవరాలి వరసయ్యే బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో..