Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇది పెద్దనోట్ల రద్దు ఫలితం కాదా.. ఆటోమొబైల్స్ అమ్మకాల ఘోర పతనం

పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిత్య ప్రచారానికి దిగుతున్నప్పటికీ వాస్తవాలు మరొక రకంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆటో మొబైల్ అమ్మకాలు గత 16 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత క్షీణస్థాయికి పతన

ఇది పెద్దనోట్ల రద్దు ఫలితం కాదా.. ఆటోమొబైల్స్ అమ్మకాల ఘోర పతనం
హైదరాబాద్ , బుధవారం, 11 జనవరి 2017 (05:31 IST)
పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిత్య ప్రచారానికి దిగుతున్నప్పటికీ వాస్తవాలు మరొక రకంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆటో మొబైల్ అమ్మకాలు గత 16 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత క్షీణస్థాయికి పతనమైపోయాయని సియామ్ డైరెక్టర్ విష్ణు మథూర్ ప్రకటించారు. గత డిసెంబర్ నెలలో 12,21,929 పాసింజర్, కమర్షియల్ వాహనాలు, మరియు టూవీలర్, త్రీ వీలర్ వాహనాలను దేశీయ ఆటోమొబైల్ ఉత్పత్తిదారులు అమ్మారని భారతీయ ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సొసైటీ పారిశ్రామిక విభాగం పేర్కొంది.
 
2000వ సంవత్సరం డిసెంబర్ తర్వాత వాహన విక్రయాలు ఇంత తగ్గుముఖం పట్టడం ఇదే మొదటిసారి. 2000 సంవత్సరం వాహనాల విక్రయాలు 21.81 శాతం క్షీణించగా 2016 డిసెంబర్‌లో వాటి అమ్మకాలు 18.66 శాతానికి పడిపోయాయని సియామ్ డైరెక్టర్ విష్ణు మథూర్  వెల్లడించారు. తేలికపాటి వాహనాల విక్రయాలు మాత్రమే గత డిసెంబర్లో 1.15 శాతం పెరుగుదలను నమోదు చేసాయని మధూరం తెలిపారు.
 
అయితే ఈ క్షీణత తాత్కాలికమేనని, పిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రకటించేంతవరకు వాహనాలకు డిమాండ్ తగ్గుముఖంలోనే ఉంటుందని మథూర్ స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దు, డబ్బు కొరతతో మనోబావాలు దెబ్బతిన్న వినియోగదారుల్లో విశ్వాసాన్ని ఏమేరకు పెంపొందించగలమనే దానిపైనే పరిస్థితిలో మార్పు జరుగుతుందని మధూర్ చెప్పడం గమనార్హం.
 
నగదు కొరతకు పరిష్కారం కనుగొనడం లోనే మొత్తం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రాతిపదిక అని మధూరు అసలు విషయం చెప్పకనే చెప్పేశారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నంతపనీ జరిగింది.. ఆ జవాన్‌ని బదిలీచేశారు..