Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో వాణిజ్య ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్

Advertiesment
ఏపీలో వాణిజ్య ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్
, మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:49 IST)
విజయవాడలో ఏర్పాటు చేసిన వాణిజ్య ఉత్సవాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఏపీలో ఎగుమతుల వృద్దే లక్ష్యంగా ఈ వాణిజ్య ఉత్సవ్‌ జరుగుతోంది. రెండు రోజుల పాటు సాగే ఈ భారీ వాణిజ్య సదస్సును అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. 
 
విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్‌ సెంటర్‌లో సెమినార్ జరుగుతోంది. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 
ప్రస్తుతం ఏపీ నుంచి 4 ఓడరేవుల ద్వారా ఎగుమతులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఏపీ నుంచి 16.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్‌ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీక్షకు తీసుకొచ్చి డబ్బులివ్వట్లేదు.. కిరాయి కూలీల ఆందోళన