Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లక్షకు పైగా నెలవారీ వినియోగదారులను నమోదు చేసుకున్న ఏంజెల్ బ్రోకింగ్

లక్షకు పైగా నెలవారీ వినియోగదారులను నమోదు చేసుకున్న ఏంజెల్ బ్రోకింగ్
, బుధవారం, 10 జూన్ 2020 (21:03 IST)
భారతదేశపు అతిపెద్ద ఇండిపెండెంట్ ఫుల్-సర్వీస్ డిజిటల్ బ్రోకింగ్ సంస్థ అయిన ఏంజెల్ బ్రోకింగ్, మార్చి 2020లో లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి లైఫ్ టైం సగటున నెలవారీ 1 లక్ష కొత్త అధిక ఖాతాలను నమోదు చేసుకున్నది. వినియోగదారు బేస్ పెరుగుదల మా వేదికలో ఒకే రోజులో సుమారు 2 మిలియన్ ట్రేడ్‌లను అమలు చేస్తూ, మా రోజువారీ ట్రేడింగ్ వాల్యూమ్‌లను మరింత వేగవంతం చేసింది.
 
ఇది ఏంజెల్ బ్రోకింగ్ యొక్క బహుళ-విభాగ మార్కెట్ నాయకత్వాన్ని మరింత మెరుగుపరిచింది. ఇది మా 2+ మిలియన్ల సంతృప్తి చెందిన వినియోగదారుల యొక్క సురక్షితమైన, అవరోధరహిత మరియు ఉన్నతమైన అనుభవాన్ని ప్రదర్శిస్తుంది. మా ఐట్రేడ్ ప్రైమ్ ప్లాన్ ద్వారా సరళీకృత మరియు అత్యంత పోటీ ధరల నిర్మాణాన్ని అందించే మా వ్యూహం, క్లయింట్ సముపార్జనలో పరిశ్రమ వృద్ధి కంటే మెరుగైనది. ఈ ప్లాన్ మా ఖాతాదారులకు ప్రాథమిక పరిశోధన మరియు సలహాతో సహా పూర్తిగా ఉచిత బ్రోకింగ్ సేవలను పొందే అవకాశాన్ని అందిస్తుంది.
 
ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్, సిఎంఓ, ప్రభాకర్ తివారీ మాట్లాడుతూ, “ఏంజెల్ బ్రోకింగ్ అనేది ఒక డిజిటల్ ఫస్ట్ సంస్థ, ఇది సింగిల్ మైండెడ్ వినియోగదారు-కేంద్రీకృతంతో తనవిధులలో ప్రముఖ డిజిటల్ సాధనాలు మరియు వేదికలను ఉపయోగించుకుంటుంది. సాంప్రదాయ బ్రోకింగ్ సంస్థలతో పోల్చితే మా డిజిటల్ బ్రోకింగ్ సర్వీసులను ప్రదర్శించడంలో సహాయపడటానికి ప్రస్తుత దేశవ్యాప్త లాక్ డౌన్ అనే చీకట్లో దివిటీలాంటిది. పరిశోధన మరియు సలహా పరంగా సరళీకృత ధరల నిర్మాణం మరియు ఇతర విలువ-ఆధారిత సేవల వలన, ఈ పోటీ ప్రపంచంలో, ముఖ్యంగా టైర్ 2 మరియు టైర్ 3 పట్టణాల్లో వినియోగదారులు మాకు ప్రాధాన్యత ఇచ్చారు.”
 
సిఇఒ వినయ్ అగర్వాల్ మాట్లాడుతూ, “ఏంజెల్ బ్రోకింగ్ భారతదేశంలో రిటైల్ వ్యాపారం విధానాన్నే మార్చివేసింది మరియు విస్తృతమైన ఆర్థిక పరిష్కారాలను అందిస్తోంది. కస్టమర్లకు, రూపకల్పన చేయడం, అమలు చేయడం మరియు సంపాదించడం వంటి దశల్లో, మా వేదిక యొక్క సామర్థ్యాలను అనుకూలపరచడానికి, మేము నిరంతరం ప్రయత్నిస్తాము, తద్వారా నవ-తరం వ్యాపారులు మరియు పెట్టుబడిదారులకు సరైన భాగస్వామి అవుతామని వాగ్దానం చేస్తున్నాము.”

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే.. రూ.10వేలు జరిమానా