Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెస్లా వచ్చినా పోటీని తట్టుకుని ఇలాగే ముందుకు వెళతాం : ఆనంద్ మహీంద్రా

Advertiesment
anand mahindra

ఠాగూర్

, మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (19:51 IST)
టెస్లా వంటి దిగ్గజ సంస్థలు భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటికీ తద్వారా ఎదురయ్యే పోటీని తట్టుకుని ముందుకు పోతామని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్, దేశ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లోకి టెస్లా కంపెనీ అడుగుపెడితే తద్వారా ఎదురయ్యే పోటీని ఎలా తట్టుకుంటారంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా తనదైనశైలిలో స్పందించారు. 
 
1991లో ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన తర్వాత ఇలాంటి ఎన్నోప్రశ్నలు ఉత్పన్నమయ్యాయన్నారు. అపుడు మార్కెట్‌లోకి వచ్చిన టాటా, సుజుకీ వంటి పలు కంపెనీల పోటీని తట్టుకుని నిలబడ్డామని గుర్తుచేశారు. మహీంద్రా ఉత్పత్తులపై ప్రజలకు ఉన్న నమ్మకమే దీనికి కారణమన్నారు. 
 
టెస్లా మార్కెట్‌లోకి వచ్చినా తమ సంస్థ ఇలాగే ముందుకు వెళుతుందని ఆయన వివరించారు. భారత ప్రజలు, వినియోగదారులు ఇస్తున్న ప్రోత్సాహంతో పోటీని తట్టుకుని ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, 2018లో ఎలాన్ మస్క్ సంస్థలు ఇబ్బందుల్లో ఉన్నపుడు ఆయనకు మద్దతు ఇస్తూ పోస్టును ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. అపుడు ఆయనకు ఎలాగైతే మద్దతిచ్చామో, ఇపుడు కూడా అలాగే ఉంటామని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం (Video)