Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో అపూర్వ ఆదరణ సొంతం చేసుకుంటున్న జీస్క్వేర్‌ ఈడెన్‌ గార్డెన్‌ ప్లాటెడ్‌ కమ్యూనిటీ

Advertiesment
G Square Eden Garden
, శుక్రవారం, 30 డిశెంబరు 2022 (17:20 IST)
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్లాట్‌ ప్రమోటర్‌, జీస్క్వేర్‌ హౌసింగ్‌ ఇటీవలనే హైదరాబాద్‌లోని బీఎన్‌ రెడ్డి నగర్‌లో తమ మొదటి ప్రాజెక్ట్‌ జీస్క్వేర్‌ ఈడెన్‌ గార్డెన్‌ను  ఆవిష్కరించింది. హైదరాబాద్‌లో మొట్టమొదటి స్పోర్ట్స్‌ థీమ్డ్‌ ప్లాటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దబడిన ఈ ప్రాజెక్ట్‌, హైదరాబాద్‌ నగర పరిధిలోని బీఎన్‌ రెడ్డి నగర్‌లో ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో 484 ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్లాట్స్‌ ఉన్నాయి. వీటన్నిటినీ జీహెచ్‌ఎంసీ మరియు రెరా అనుమతించాయి. జీస్క్వేర్‌ ఈడెన్‌ గార్డెన్‌ ప్లాటెడ్‌ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించిన తొలి నాలుగు రోజుల్లోనే 1000కు పైగా సందర్శనలు జరగడంతో పాటుగా 290కు పైగా బుకింగ్స్‌ జరిగాయి.
 
తద్వారా హైదరాబాద్‌లో అత్యంత వేగంగా విక్రయించబడుతున్న లగ్జరీ విల్లా ప్లాట్‌ కమ్యూనిటీలలో ఒకటిగా నిలిచింది. ఈ ప్లాట్స్‌కు వచ్చిన డిమాండ్‌ కారణంగా ఈ ప్రాజెక్ట్‌కు 20%కు పైగా ధరల పెరుగుదల మొదటి నాలుగు రోజుల్లోనే కనిపించింది. ప్రారంభోత్సవ ఆఫర్‌గా జీస్క్వేర్‌ ఈడెన్‌ గార్డెన్‌  ప్లాట్‌ ధరలను 01 జనవరి 2023 వరకూ మార్కెట్‌ ధర కంటే తక్కువగా విక్రయించనున్నారు. వినియోగదారులు ఈ ప్లాట్‌లను చదరపు గజానికి 71,999 రూపాయలు చెల్లించి సొంతం చేసుకోవచ్చు. జనవరి 02, 2023 వ తేదీ నుంచి ఈ ప్లాట్‌ ధరలు చదరపు గజానికి 75వేల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ నుంచి కేవలం 5 నిమిషాల దూరంలో జీస్క్వేర్‌ ఈడెన్‌ గార్డెన్‌ ఉంది. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ పార్క్‌లలో ఒకటైన ఆదిభట్లకు అత్యంత సమీపంలో బీఎన్‌ రెడ్డి నగర్‌ ఉంది.
 
ఈశ్వర్‌ ఎన్‌ (సీఈఓ, జీస్క్వేర్‌ హౌసింగ్‌) మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్‌లో మా మొదటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. హైదరాబాద్‌లో  అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఒకటిగా బీఎన్‌ రెడ్డి నగర్‌ నిలుస్తుంది. రాబోయే కొద్ది సంవత్సరాలలో ఇక్కడ ధరల పరంగా భారీ వృద్ధిని వినియోగదారులు చూడగలరు. మా జీస్క్వేర్‌ ఈడెన్‌ గార్డెన్‌ ప్రాజెక్ట్‌ వినూత్నమైన లగ్జరీ ప్లాటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌. ఇది ప్రపంచశ్రేణి వసతులను అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కు అపూర్వ స్పందన లభించింది. ఇప్పటికే 290 మంది వినియోగదారులు తమ ప్లాట్స్‌ను బుక్‌ చేసుకున్నారు’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖను మాకిస్తే ఓ చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటాం : మంత్రి ధర్మాన