Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సామాన్యులపై బాదుడే బాదుడు... పాల ధర పెంపు

Advertiesment
Amul milk
, గురువారం, 1 జులై 2021 (13:12 IST)
సామాన్యులపై బాదుడే బాదుడు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అలాగే వంట నూనెల ధరలు కూడా పెరిగిపోయాయి. గ్యాస్ సిలిండర్ ధర కూడా  నుంచే పెరిగింది. ఇప్పుడు వీటి సరసన పాలు కూడా వచ్చి చేరాయి. పాల ధర జూలై-1 నుంచి పెరిగింది. 
 
అమూల్ మిల్క్ పాల ధర లీటరుకు రూ.2 పెరిగింది. జూలై 1 నుంచి రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ సీనియర అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
 
అమూల్ మిల్క్ బ్రాండ్స్ అన్నింటికీ రేట్ల పెంపు వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. దీంతో పాలు కొనుగోలు చేసే వారు లీటరుకు ఇప్పుడు రూ.2 అదనంగా చెల్లించుకోవాలి. అమూల్‌కు చెందిన గోల్డ్, టాజా, శక్తి, టీ స్పెషల్ వంటి పలు బ్రాండ్ల ధరలు పెరిగాయి. 
 
ఇప్పుడు లీటరు పాలు కొనాలంటే రూ.48 నుంచి రూ.58 వరకు చెల్లించుకోవాలి. పాల క్యాకేజింగ్ వ్యయాలు 30 నుంచి 40 శాతం పెరిగాయని, అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ 30 శాతం పెరిగిందని ఆయన వివరించారు. అలాగే ఎనర్జీ కాస్ట్ 30 శాతం పెరిగిందని తెలిపారు. దీంతో పాల ధర పెంచాల్సిన పరిస్థితి నెలకొందని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీటి ప్రాజెక్టుల వద్ద భారీగా బలగాలు.. ఏపీ-టీఎస్‌ల మధ్య జలవివాదం!