వినియోగదారుల ఉత్పత్తుల రంగంలో స్టార్టప్‌ల కోసం గ్లోబల్ బిజినెస్ యాక్సిలరేటర్ అయిన ప్రొపెల్ యొక్క నాల్గవ సీజన్‌ను ప్రారంభించినట్లు అమెజాన్ ఇండియా ఈరోజు బెంగుళూరులో ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న భారతీయ బ్రాండ్‌లు, స్టార్టప్‌లు ఈ-కామర్స్ ఎగుమతులను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా కస్టమర్‌లను చేరుకోవడానికి పూర్తిస్థాయి మద్దతును అందించడానికి తీర్చిదిద్దబడిన వినూత్నమైన ప్రోగ్రామ్ ఇది. ప్రొపెల్ ఎస్4 అంతర్జాతీయ మార్కెట్‌లలో 50 స్టార్టప్‌ల ప్రారంభానికి మద్దతు ఇస్తుంది, భారతదేశం నుండి గ్లోబల్ బ్రాండ్‌లను సృష్టించనుంది.
దీనిలో పాల్గొనే స్టార్టప్‌లు AWS యాక్టివేట్ క్రెడిట్‌లు, ఆరు నెలల ఉచిత లాజిస్టిక్స్, అకౌంట్ మేనేజ్‌మెంట్ సపోర్ట్, అలాగే టాప్ 3 విజేతల కోసం అమెజాన్ నుండి $100K గ్రాంట్‌తో సహా $1.5 మిలియన్లకు పైగా విలువైన మొత్తం రివార్డ్‌లను గెలుచుకుంటాయి. పాల్గొనే స్టార్టప్‌లు భారతీయ ఆదాయ-ఆధారిత ఫైనాన్సింగ్ సంస్థలైన క్లబ్, వెలాసిటీ, గెట్‌వాన్టేజ్‌లతో కనెక్ట్ అవ్వడానికి కూడా అమెజాన్ సహాయం చేస్తుంది, ఇవి పాల్గొనే స్టార్టప్‌లకు తమ వ్యాపారాన్ని విస్తృత స్థాయిలో విస్తరించడానికి క్యూరేటెడ్ ఆఫర్‌లను అందిస్తాయి.
ప్రోగ్రామ్ కోసం అప్లికేషన్‌లు ఈ రోజు తెరవబడతాయి, జూన్ 9, 2024న ముగుస్తాయి. ఇది డెమో-డేతో ముగుస్తుంది, దీనిలో పాల్గొనేవారు తమ వ్యాపార ప్రతిపాదనలను ప్రముఖ విసి సంస్థలకు అందించడానికి, వారి కార్యకలాపాలను విస్తరించడానికి నిధులను పొందే అవకాశాన్ని పొందుతారు. ప్రొపెల్ ఎస్4లో భాగంగా, అమెజాన్ లీడర్‌లు, విసి భాగస్వాములు, సీనియర్ ఇండస్ట్రీ లీడర్‌లతో కూడిన మెంటార్‌షిప్ బోర్డును అమెజాన్ ఏర్పాటు చేసింది, వారు అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌లతో కలిసి పనిచేయటంతో పాటుగా, వారికి తగిన వనరులు, 1:1 మెంటార్‌షిప్, వర్క్‌షాప్‌లను గ్లోబల్ డిమాండ్ ప్యాటర్న్‌లు, ఈ-కామర్స్ ద్వారా విజయవంతమైన ఎగుమతుల వ్యాపారం నిర్మాణంపై తగిన పరిజ్ఞానం అందిస్తారు. పాల్గొనే స్టార్టప్‌ల నెట్‌వర్క్‌కు సహాయం చేయడానికి, వారి ప్రస్తుత పర్యావరణ వ్యవస్థ నుండి నేర్చుకోవడానికి అనుభవజ్ఞులైన వ్యవస్థాపకులను, ప్రోపెల్ పూర్వ విద్యార్థులను ఆహ్వానించడం ద్వారా పీర్ లెర్నింగ్‌పై దృష్టి సారించే సెషన్‌లను కూడా అమెజాన్ నిర్వహిస్తుంది.
అమెజాన్ ఇండియా గ్లోబల్ ట్రేడ్ డైరెక్టర్ భూపేన్ వాకంకర్ మాట్లాడుతూ, “ప్రొపెల్ యాక్సిలరేటర్ యొక్క నాల్గవ సీజన్ ప్రారంభం పట్ల నేను సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మినిమలిస్ట్, సిరోనా, ఎకోరైట్, పెర్ఫోరా, బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా భారతీయ స్టార్టప్‌లకు మేము ఇప్పటికే సహాయం చేసాము. మేము అభివృద్ధి చెందుతున్న కంపెనీలకు వారి వ్యాపార ప్రతిపాదనలకు జీవం పోయడానికి మరియు భారతదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా జనాదరణ పొందిన బ్రాండ్‌లను రూపొందించడానికి తగిన అవకాశాన్ని అందిస్తూ ప్రోపెల్ యాక్సిలరేటర్‌ను ప్రారంభించాము. మేము ప్రోపెల్ యొక్క సరికొత్త సీజన్ కోసం సంతోషిస్తున్నాము. ఈ సంవత్సరం గ్లోబల్ మార్కెట్‌లలో భారతదేశం నుండి 50 వరకు స్టార్టప్‌లను ప్రారంభించడంలో సహాయపడటానికి విస్తరించిన ప్రయోజనాలు, మద్దతుతో సీజన్ 4 మరింత పెద్దదిగా, మెరుగైనదిగా మలుస్తున్నాము. 2025 నాటికి భారతదేశం నుండి $20 బిలియన్ల ఇ-కామర్స్ ఎగుమతులను ప్రారంభించాలనే మా నిబద్ధతలో ఈ కార్యక్రమం కీలక భాగం.." అని అన్నారు.
ప్రోపెల్ యాక్సిలరేటర్ సీజన్ 3 విజేతలలో ఒకరైన పెర్ఫోరా సహ వ్యవస్థాపకుడు తుషార్ ఖురానా మాట్లాడుతూ, “పెర్ఫోరా వద్ద మేము ప్రపంచవ్యాప్తంగా విక్రయించడం పట్ల ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉన్నాము. గతంలో మేము భారతదేశం నుండి ప్రపంచం కోసం రూపొందించిన బ్రాండ్‌ల నుండి ప్రేరణ పొందాము, నోటి సంరక్షణ వంటి విభాగం యొక్క సార్వత్రిక స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, గ్లోబల్ మార్కెట్‌లకు విక్రయించడం ఎల్లప్పుడూ మాకు ఆసక్తిగానే ఉంటుంది. మేము 2023లో ప్రొపెల్ స్టార్టప్ యాక్సిలరేటర్ యొక్క మూడవ సీజన్ కోసం నమోదు చేసుకున్నప్పుడు ఈ దిశగా ఒక సంచలనం వచ్చింది.
ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ద్వారా, మేము మా మార్కెట్ ఆవిష్కరణని వేగవంతం చేసాము, వారి అనుభవాల నుండి తెలుసుకోవడానికి సరైన సహచరులతో కనెక్ట్ అయ్యాము. విసి సంస్థలతో సన్నిహితంగా మెలగడం, సంబంధిత పరిజ్ఞానంను పొందడానికి ఇతర పరిశ్రమ నాయకులను కలవటం జరిగింది. అమెజాన్ బృందం ఏర్పాటు నుండి ప్రారంభించే వరకు మాకు పూర్తి మద్దతు ఇచ్చింది. ఈ ప్రోగ్రామ్ మా ప్రపంచ ఆశయాలకు ఉత్ప్రేరకం పాత్రను పోషించింది. ఇది ప్రారంభం మాత్రమే, పెర్ఫోరాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లకు అందించడానికి మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు.