Publish Date: Thu, 26 Mar 2026 (23:54 IST)
Updated Date: Thu, 26 Mar 2026 (23:55 IST)
అమేజాన్ యాడ్స్ భారతదేశంలో తమ మొట్ట మొదటి ఫ్లాగ్ షిప్ కార్యక్రమం కనక్టెడ్ వరల్డ్స్ ను నిర్వహించింది. అమేజాన్ యాడ్స్ క్రియేటివ్ ఏజెంట్ మరియు యాడ్స్ ఏజెంట్ వంటి కొత్త AI సాధనాలను, ఏకీకృత కాంపైన్ నిర్వహణ, అమేజాన్ యాడ్స్ క్రియేటర్ ప్రోగ్రాంను పరిచయం చేసిన కారణంగా కార్యక్రమం ప్రకటనదారులు, ఏజెన్సీలు, భాగస్వాములను ఆకర్షించింది, భారతదేశపు బ్రాండ్స్ కోసం సృజనాత్మకతకు స్వేచ్ఛను కలిగించింది. నిరంతరంగా కనక్ట్ అయి ఉండటానికి, ఫుల్-ఫన్నెల్ ప్రకటనా అనుభవం అందించడానికి కనక్టెడ్ వరల్డ్స్ మూడు కీలకమైన స్తంభాలను ఒక చోట చేర్చాయి- యాడ్ టెక్,కంటెంట్, వాణిజ్యం.
తమ పదేళ్ల ప్రయాణంలో, అన్ని స్థాయిలకు చెందిన బ్రాండ్స్ కస్టమర్లను చేరుకోవడం నుండి వీడియో, డిస్ ప్లే, డివైజ్ యాడ్స్ సహా ఫార్మాట్స్‌లో చైతన్యం నుండి కొనుగోలు వరకు పూర్తి వినియోగదారు ప్రయాణం అంతటా కనక్షన్స్‌ను రూపొందించడానికి అమేజాన్ యాడ్స్ అభివృద్ధి చెందింది. ప్రైమ్ వీడియో, అమేజాన్ MX ప్లేయర్, అమేజాన్ డిమాండ్ సైడ్ ప్లాట్ ఫాంలో మూడవ పక్షానికి చెందిన పబ్లిషర్స్ తో అమేజాన్ యాడ్స్ ఈరోజు కస్టమర్లు ఎక్కడ కొనుగోలు చేసినా, స్ట్రీమ్ చేసినా, ఆన్ లైన్లో సమయం వినియోగించినా అమేజాన్ యాడ్స్ అక్కడకు చేరుకుంటోంది. బ్రాండ్స్ ఈ చేరికను చేరుకోవడంలో సహాయపడటానికి, అమేజాన్ యాడ్స్‌లో బ్రాండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఈ క్షణాలను అర్థవంతమైన బ్రాండ్ కనక్షన్స్ లోకి మార్చే వినూత్నమైన ప్రకటనా అనుభవాలుగా రూపొందిస్తోంది.
భారతదేశపు ప్రకటనా చిత్రం గత దశాబ్దంగా గణనీయంగా పరిణితి చెందింది, బ్రాండ్స్ మరియు వాటి వినియోగదారుల అంచనాలు కూడా పెరిగాయి. బ్రాండ్స్ అర్థవంతమైన, సమర్థవంతమైన కనక్షన్స్‌ను తమ ప్రేక్షకులతో రూపొందించడంలో సహాయపడటం గురించి అమేజాన్ యాడ్స్‌లో మేము ప్రాధాన్యతనిస్తాము. AI-పవర్డ్ సృజనాత్మక సాధనాలు నుండి ఏకీకృత కాంపైన్ నిర్వహణ వరకు ఈరోజు మేము ప్రకటించిన వినూత్నతలు ఒక లక్ష్యంతో రూపొందించబడ్డాయి AI- భారతదేశపు బ్రాండ్స్ సరైన కస్టమర్ ను, సరైన సమయంలో పూర్తి కొనుగోలు ప్రయాణంలో చేరుకోవడంలో సహాయపడటం, అని గిరీష్ ప్రభు, వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్, అమేజాన్ యాడ్స్ ఇండియా అన్నారు.
ప్రకటనదారుల కోసం సామర్థ్యాలను ప్రోత్సహించే AI ఆవిష్కరణలు
కార్యక్రమంలో, అమేజాన్ యాడ్స్ అమేజాన్ యొక్క విస్తృతమైన రిటైల్ అభిప్రాయాలను ఉపయోగిస్తూ కాంపైన్స్ కోసం ప్రొఫెషనల్ నాణ్యత గల ప్రకటనలు సులభంగా రూపొందించడానికి ప్రకటనదారులకు వీలు కల్పించే క్రియేటివ్ ఏజెంట్ ను ప్రారంభించింది. సృజనాత్మక భాగస్వామిగా మరియు వ్యూహాకర్తగా వ్యవహరిస్తూ, ఇది కేవలం ఒకప్పుడు పెద్ద బ్రాండ్స్ కోసం మాత్రమే కేటాయించబడిన అదే రకమైన సృజనాత్మకతతో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా కేవలం గంటల్లోనే ఉన్నతమైన ప్రకటనలు చేయడానికి అన్ని స్థాయిలకు చెందిన ప్రకటనదారులు సహాయపడుతుంది. సహజమైన భాషా ప్రాంప్ట్స్ ను ఉపయోగిస్తూ, ప్రకటనదారులు ఉత్పత్తిని మరియు ప్రేక్షకుల పరిశోధనను నిర్వహించవచ్చు మరియు ఆలోచనలను చేయవచ్చు, స్టోరీబోర్డ్ ఫార్మాట్ లో సృజనాత్మకమైన భావనలను అభివృద్ధి చేయవచ్చు, ఆకర్షణీయమైన వీడియోను ఉత్పత్తి చేయవచ్చు మరియు కస్టమర్లకు అనుగుణంగా ఉండే ప్రకటనలను ప్రదర్శించవచ్చు.