Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓకెఆర్‌లను వినియోగించి లక్ష్యాలను పర్యవేక్షించేందుకు ప్రాఫిట్‌ డాట్‌ కోతో ఏఐఎఫ్‌ఎఫ్‌ భాగస్వామ్యం

ఓకెఆర్‌లను వినియోగించి లక్ష్యాలను పర్యవేక్షించేందుకు ప్రాఫిట్‌ డాట్‌ కోతో ఏఐఎఫ్‌ఎఫ్‌ భాగస్వామ్యం
, సోమవారం, 14 డిశెంబరు 2020 (19:33 IST)
భారతదేశంలో ఫుట్‌బాల్‌ క్రీడ పర్యవేక్షక సంస్థ ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఏఐఎఫ్‌ఎఫ్‌), ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లను మరియు లీగ్‌లను నిర్వహిస్తోంటుంది. ఇప్పుడు ప్రాఫిట్‌ డాట్‌ కో యొక్క ఓకెఆర్‌ సాఫ్ట్‌వేర్‌ను 2019లో విడుదల చేసిన తమ ద్వితీయ నాలుగు సంవత్సరాల వ్యూహాత్మక ప్రణాళికను పర్యవేక్షించడం కోసం ఆవిష్కరించింది. ఓకెఆర్‌ యొక్క వ్యూహాత్మక ఉపకరణం ఈ ప్లాన్‌ను పర్యవేక్షించడంతో పాటుగా దాని వృద్ధి మరియు విజయాలను సైతం పర్యవేక్షిస్తుంది. ప్రాఫిట్‌ డాట్‌ కో కార్యాచరణను అమలు చేస్తోన్న మొట్టమొదటి క్రీడా ఫెడరేషన్‌ ఏఐఎఫ్‌ఎఫ్‌. మార్చి 2020లో తమ వ్యూహాత్మక ప్రణాళికను క్రమబద్దీకరించడానికి మరియు అమలు చేయడానికి అధికశాతం సాంకేతిక సిబ్బందిని ఇది నిషేదించింది.
 
‘‘ఓకెఆర్‌లు ప్రత్యేకమైనవి. ఎందుకంటే దీని కార్యాచరణ పారదర్శకతను తీసుకురావడంలో సహాయపడుతుంది. మరీముఖ్యంగా భాగస్వామ్యాలను ఏర్పరుచుకున్నప్పుడు. ఓకెఆర్‌లు విభిన్న శాఖల నడుమ చర్చలు జరిగాయని నిర్థారించడంతో పాటుగా వేగంగా పనులు పూర్తి కావడానికి, మరింత సమర్థత తీసుకురావడానికి సహాయపడతాయి. ప్రభావవంతమైన పర్యవేక్షణ మరియు ట్రాకింగ్‌ టూల్‌ మాకు కావాల్సి ఉంటుంది. ఇది టీమ్‌కు అమరికల్లేని భావాన్ని అందించాలనుకున్నాం. ఈ కారణమే మమ్మల్ని ఓకెఆర్‌లను ఎంచుకునేలా చేసింది’’ అని శ్రీ కౌశల్‌ దాస్‌, జనరల్‌ సెక్రటరీ, ఏఐఎఫ్‌ఎఫ్‌ అన్నారు.
 
శ్రీ కౌశల్‌ దాస్‌, జనరల్‌ సెక్రటరీ, ఏఐఎఫ్‌ఎఫ్‌ మరింతగా మాట్లాడుతూ, ‘‘ఓకెఆర్‌ సాఫ్ట్‌వేర్‌ను పలు డిజిటల్‌ ప్రోగ్రామ్‌లు మరియు కార్యక్రమాలను మహమ్మారి వేళ ఆవిష్కరించేందుకు మరియు అమలు చేసేందుకు వినియోగించాము. మే 2020లో మేము ఏఐఎఫ్‌ఎఫ్‌ టీవీ ప్రసారాలను ఆరంభించాం. ఇప్పటి వరకూ ఏడు మిలియన్‌ వ్యూస్‌ లభించాయి. తామిప్పుడు పలు డిజిటల్‌ ఉపకరణాలు మరియు ప్రాజెక్టులపై సైతం  పనిచేస్తున్నాము. దీనిలో ఒకటి  సాయ్‌ నుంచి స్టార్ట్‌-ఈ-పాఠశాలతో భాగస్వామ్యం కలిగి ఉంది. సీజన్‌ ప్రారంభం కావడంతో ఏఐఎఫ్‌ఎఫ్‌, అక్టోబర్‌ రెండవ వారంలో ఆన్‌ ఫీల్డ్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్‌ను అన్ని కోవిడ్‌ నిబంధనలనూ అనుసరిస్తూ బయో బబుల్‌లో నిర్వహించిన మొట్టమొదటి స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌గా నిలిచింది’’ అని అన్నారు.
 
ఆయనే మరింతగా వెల్లడిస్తూ, ‘‘ఓకెఆర్‌లను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, ఈ టీమ్‌ పలు కంపెనీలు అందించే ఓకెఆర్‌  సాఫ్ట్‌వేర్‌లను పరిశీలించింది. అది మా ఓకెఆర్‌ల వ్యవస్థలో అవసరమైన లక్షణాలను అందుకోవాలనుకున్నాము. పలు కంపెనీలు అందిస్తున్న ఓకెఆర్‌ సాఫ్ట్‌వేర్‌ పరిష్కారాల నడుమ విశ్లేషణాత్మక పోలికలను చేసిన తరువాత ప్రాఫిట్‌ డాట్‌ కో మాకు తగినదిగా నిర్థారించడం జరిగింది. ఎందుకంటే, వారి సాఫ్ట్‌వేర్‌ను మేము అత్యంత సరళంగా వినియోగించగలిగాం. భారీస్థాయిలో ఇతర ఉపయుక్తమైన ఫీచర్లను సైతం ఆధునీకరించగలిగాం. ఈ యుఐ కూడా చాలా చక్కగా ఉంది. ఈ కారణాలన్నీ కూడా ఇతర ప్లాట్‌ఫామ్స్‌తో పోలిస్తే అత్యుత్తమంగా ఉంటుంది’’ అని అన్నారు.
 
మహమ్మారి ఉన్నప్పటికీ ఓకెఆర్‌ యొక్క అమలుకు ఏఐఎఫ్‌ఎఫ్‌ బృందం ఆసక్తి కనబరచడంతో పాటుగా ప్రాఫిట్‌  డాట్‌ కో ను సందేహ నివృత్తి కోసం చేరుకుంది. ఓకెఆర్‌లో అమలు చేయడానికి ముందు, అన్ని శాఖలోనూ వర్క్‌ స్థితిని గురించి తెలుసుకోవడం ఏఐఎఫ్‌ఎ్‌ఫ్‌కు  చాలా కష్టంగా ఉండేది. ఇది టీమ్‌లు ప్రయాణిస్తున్నప్పుడు తగిన యాజమాన్యం లేకపోవడం మరియు ప్రణాళిక పురోగతిని సమీక్షించడంలోనూ అసమానతలకు దారి తీసేది.
 
‘‘ఏఐఎఫ్‌ఎఫ్‌ లాంటి క్రీడా ఫెడరేషన్‌లు తమ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా వాటిని క్రమబద్దీకరిచేందుకు ప్రాఫిట్‌ డాట్‌ కోను ఎంచుకున్నాం. ఇది అన్ని ఇతర ఫెడరేషన్స్‌ మరియు  వ్యాపార సంస్థలు వ్యాపార ఉపకరణాలను తమ లక్ష్యాలను మెరుగుపరుచుకునేందుకు  వినియోగిస్తున్నాయి’’ అని శ్రీ సెంథిల్‌ రాజగోపాలన్‌, ప్రెసిడెంట్‌, ప్రాఫిట్‌  అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారి సేవలో నూతన వధూవరులు నిహారిక- చైతన్య