హైదరాబాద్ నగరానికి చెందిన ఆకాష్ ఇనిస్టిట్యూట్ విద్యార్థిని రషికా తౌఫిక్ మున్షీ, ఐసీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలలో 99% మార్కులను సాధించడం ద్వారా రాష్ట్రంలో రెండవ ర్యాంకును సాధించింది. ఈ ఫలితాలను ఇటీవలనే ప్రకటించారు. ఈ పరీక్షలలో రాష్ట్రంలోనే సైన్స్ టాపర్‌గానూ ఆమె నిలిచారు.
నగరంలోని నాసర్ స్కూల్ విద్యార్థిని అయిన రషికా, తల్లిదండ్రులు వృత్తిపరంగా దంత వైద్యులు. రషికా తన 10వ తరగతిలో కూడా డిస్టింక్షన్ సాధించడంతో పాటుగా తన స్కూల్ టాపర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆమె జెఈఈ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు.
రషికా సాధించిన విజయాన్ని అభినందించిన శ్రీ ఆకాష్ చౌదరి, మేనేజింగ్ డైరెక్టర్, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్‌ఎల్) మాట్లాడుతూ, ఐసీఎస్‌ఈ 12 వ తరగతి పరీక్షా ఫలితాలలో అద్భుతమైన ఫలితాలను సాధించిన మా విద్యార్థిని రషికా ను అభినందిస్తున్నాను.
ఆమె పడిన కష్టం, ఆమె తల్లిదండ్రులు అందించిన మద్దతు, ఆకాష్ వద్ద అందించిన నాణ్యమైన బోధన, మెంటారింగ్, మార్గనిర్దేశకత్వంకు ప్రతీక ఇది. పరీక్షల కోసం సిద్ధమవుతున్న మా విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. వారి భవిష్యత్ ప్రయత్నాలలో సైతం వారు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాము అని అన్నారు.
విద్యాపరంగా విజయం సాధించాలని తపిస్తున్న విద్యార్థులు విజయం సాధించడంలో సహాయపడటాన్ని ఆకాష్ ఇనిస్టిట్యూట్ లక్ష్యం చేసుకుంది. కరిక్యులమ్ మరియు కంటెంట్ డెవలప్‌మెంట్ కోసం కేంద్రీకృత అంతర్గత ప్రక్రియను ఇది కలిగి ఉండటంతో పాటుగా ఫ్యాకల్టీ శిక్షణ మరియు పర్యవేక్షణను సైతం తమ నేషనల్ అకడమిక్ బృందం ద్వారా చేస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఆకాష్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు పలు ఇంజినీరింగ్, వైద్య ప్రవేశ పరీక్షలలో రికార్డు స్థాయిలో విజయం సాధించడంతో పాటుగా పోటీ పరీక్షలైనటువంటి ఎన్‌టీఎస్‌ఈ, కెవీపీవై మరియు ఒలింపియాడ్స్‌లో సైతం విజయం సాధించారు.