Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో ‘విజయవాడ హైవే రోడ్‌ నుంచి భవిష్యత్‌కు’ సదస్సు నిర్వహించిన జీ స్క్వేర్‌

Advertiesment
image
, మంగళవారం, 13 డిశెంబరు 2022 (23:19 IST)
జీ స్క్వేర్‌ హౌసింగ్‌ సంస్థ ఎకనమిక్‌ టైమ్స్‌ సహకారంతో ‘విజయవాడ హైవే రోడ్‌ టు ద ఫ్యూచర్‌ (విజయవాడ హైవే రోడ్‌ నుంచి భవిష్యత్‌ దిశగా)’ శీర్షికన ఓ సదస్సును హైదరాబాద్‌లోని జెడబ్ల్యు మారియట్‌ హోటల్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర  ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్‌ రంజన్‌ పాల్గొన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో పరిశ్రమకు చెందిన పలువురు సుప్రసిద్ధ వక్తలు సైతం పాల్గొన్నారు.
 
ఎకనమిక్‌ టైమ్స్‌ సీనియర్‌ ఎడిటర్‌ అశుతోష్‌ సిన్హా ఈ చర్చకు మోడరేటర్‌గా వ్యవహరించగా, క్రెడాయ్‌నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ గుమ్మి రామ్‌ రెడ్డి; సీబీఆర్‌ఈ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ జిప్సన్‌ పౌల్‌; బ్లూ కోపా కో-ఫౌండర్‌, సీఓఓ శ్రీ రాఘవేంద్ర రెడ్డి; జీ స్క్వేర్‌ హౌసింగ్‌ సీఈఓ శ్రీ ఈశ్వర్‌ ఎన్‌ పాల్గొన్నారు. విజయవాడ హైవే రోడ్‌ పట్ల తమ అభిప్రాయాలను సభ్యులు వెల్లడించారు. హైదరాబాద్‌లో త్వరలో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ కేంద్రంగా మారనుందన్నారు.
 
ఈ కార్యక్రమంలో జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ, ‘‘తూర్పు కారిడార్‌ చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రణాళికలు చేస్తుంది. తెలంగాణాలో టియర్‌2, టియర్‌ 3 నగరాలలో సైతం ఐటీ పార్కులను ఏర్పాటుచేయనున్నాము. సూర్యాపేటలో త్వరలోనే 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టెక్‌ పార్క్‌ ప్రారంభించనున్నాము. పలు కంపెనీలు తమ కార్యాలయాలను అక్కడ ఏర్పాటుచేయబోతున్నాయి. అలాగే పోచారంలో చేనేత కార్మికుల సాధికారిత దిశగా కొన్ని సంస్ధలు కృషి చేస్తున్నాయి. యాదాద్రి దేవాలయం, ఆ పరిసరాలు కూడా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి’’ అని అన్నారు.
 
జీ స్క్వేర్‌ హౌసింగ్‌ సీఈఓ ఈశ్వర్‌ ఎన్‌ మాట్లాడుతూ, ‘‘ఈ హైవే మార్గం ఉపయోగించుకుని ఎంతోమంది విజయవాడ, వైజాగ్‌లను చేరుకుంటుంటారు. ఈ హైవే మార్గం భావి రియల్‌ ఎస్టేట్‌ కేంద్రంగా నిలువనుంది. ఇక్కడ పెట్టుబడి పెడితే త్వరలోనే భారీ ప్రయోజనాలను పొందగలరు’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈశాన్య రుతుపవనాలు-తిరుమల కొండను తాకిన మేఘాలు.. (video)