Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

600 మొబైల్​యాప్స్​‌పై ఆర్బీఐ సీరియస్..

reserve bank of india
, బుధవారం, 15 జూన్ 2022 (11:00 IST)
పర్సనల్ లోన్స్ ప్రస్తుతం ఈజీగా మారాయి. ఎన్నో యాప్‌లు లోన్స్ ఇచ్చేస్తున్నాయి. డాక్యుమెంట్స్ లేకుండా అప్పులు ఇచ్చేస్తున్నాయి. అయితే ఇలాంటి యాప్‌లపై ఆర్బీఐ సీరియస్ అయ్యింది. 
 
ఇంకా లోన్లను చెల్లించనివారిని తీవ్రంగా వేధిస్తున్నారంటూ కంప్లైంట్లు రావడంతో ఆర్​బీఐ రంగంలోకి దిగింది. చట్టవ్యతిరేకంగా అప్పులు ఇస్తున్న 600 మొబైల్​యాప్స్​ను ఆర్​బీఐ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ గుర్తించింది.
 
ఈ విషయమై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ఇట్లాంటి యాప్‌లపై గ్రూపు ఇచ్చిన రిపోర్టును పరిశీలిస్తున్నామని చెప్పారు. అన్​రిజిస్టర్డ్​ లెండింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై ఆర్​బీఐ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు వేలాది ఫిర్యాదులు అందాయి.  
 
లోన్లు ఇచ్చే యాప్‌లలో చాలా వరకు రిజిస్టర్​ కాలేదని, ఇలాంటి సంస్థలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని దాస్ సూచించారు. 
 
ఆర్‌బీఐ వద్ద రిజిస్టర్ అయిన లోన్ల ప్లాట్‌ఫారమ్‌లపై ఫిర్యాదులు అందితే, అప్పుడు తాము చర్యలు తీసుకుంటామని గవర్నర్ చెప్పారు. ఇటువంటి లెండింగ్ యాప్‌ల నుంచి అప్పు తీసుకునేముందు బాగా ఆలోచించాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంజారాహిల్స్ రేప్ కేసు - ఇన్నోవా కారు డ్రైవర్‌ - తల్లిదండ్రులపై కేసు