ప్రమాదంలో 32 లక్షల డెబిట్ కార్డులు... ఇప్పటికే లక్షల కార్డులు బ్లాక్
దేశ వ్యాప్తంగా ఉన్న డెబిట్ కార్డుల్లో 32 లక్షల డెబిట్ కార్డుల పరిస్థితి ప్రమాదంలో ఉంది. ఈ కార్డులు సెక్యూరిటీ ఉల్లంఘనలకు గురై ఉండొచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి. తాము కొన్ని లక్షల డెబిట్ కార్డుల
దేశ వ్యాప్తంగా ఉన్న డెబిట్ కార్డుల్లో 32 లక్షల డెబిట్ కార్డుల పరిస్థితి ప్రమాదంలో ఉంది. ఈ కార్డులు సెక్యూరిటీ ఉల్లంఘనలకు గురై ఉండొచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి. తాము కొన్ని లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేశామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ న్యూస్ రావడం కస్టమర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ముప్పు పొంచి ఉన్న కార్డుల్లో 26 లక్షలు వీసా, మాస్టర్ కార్డ్‌కు చెందినవి కాగా.. 6 లక్షలు రూపేకి చెందినవిగా బ్యాంకు వర్గాలు తెలిపాయి.
కాగా, ఈ కార్డుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులే అధికంగా ఉన్నాయి. అయితే తాము అన్ని ఏటీఎమ్‌లపై సమీక్ష నిర్వహించామని, ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించలేదని ఎస్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని కార్డులకు ముప్పు పొంచి ఉందని కార్డ్ నెట్‌వర్క్ ప్రొవైడర్లు చెప్పడంతో ముందు జాగ్రత్తగా వాటిని మారుస్తున్నట్లు ఎస్‌బీఐ బుధవారం ప్రకటించింది.