భారత్ జీడీపీ వృద్ధి ఏడు శాతానికి సవరణ!!
, గురువారం, 12 ఏప్రియల్ 2012 (12:35 IST)
ఆర్థిక సంవత్సరానికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఏడు శాతానికి సవరించినట్లు ఆసియా డెవెలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) పేర్కొంది. ఏషియన్ డెవెలప్మెంట్ ఔట్లుక్ (ఏడీఓ) నివేదికలో భారత్ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరగుతుందని వెల్లడించింది.2011-12
ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతానికి క్షీణించిన భారత్ ఆర్థికప్రగతి 2012-13లో ఏడు శాతానికి, 2013-14లో 7.5 శాతానికి పెరుగుతుందని ఆసియాప్రాంత అభివృద్ధిపై వార్షిక నివేదికలో ఏడీబీ తెలియజేసింది. ఆసియా ప్రాంతంలో జీడీపీ రేటు 2011-12లో 7.2 శాతం నుంచి 6.9 శాతానికి పడిపోయిందని యూరోజోన్ సంక్షోభంతోపాటు అంతర్జాతీయ వాణిజ్యంలో మందకొడితనమే దీనికి కారణమని పేర్కొంది.దీర్ఘకాలం పాటు అమలులో వున్న కఠిన ద్రవ్యవిధాన చర్యలు సడలించిన పక్షంలో ఈ ఏడాది పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఏడీబీ ప్రధాన ఆర్థికవేత్త చాంగ్యోంగ్రీ అన్నారు. అయితే భూ సమస్యలు, పర్వారణ నిబంధనల వంటి అవరోధాలు తొలగించలేని పక్షంలో వాటి ప్రభావం పాక్షికంగానే ఉండిపోగలదన్నారు.