Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూణే, మహారాష్ట్రలలో రిలయన్స్ డిజిటల్ సరికొత్త కళ

Advertiesment
రిలయన్స్ డిజిటల్
, బుధవారం, 5 సెప్టెంబరు 2012 (16:56 IST)
భారతదేశ వ్యాపార సంస్థలలో అగ్రగామిగా నిలిచి ఎలక్ట్రానిక్స్ విభాగంలోనూ తమ సంస్థ పేరును దేశ నలుదిక్కుల చాటిన రిలయన్స్ సంస్థ సెప్టంబర్ 4, 2012న పుణెలో రిలయన్స్ డిజిటల్ పేరుతో మరో డిజిటల్ స్టోర్‌ను ప్రారంభించింది. పుణె స్పార్ష్ ప్లాజాలో 15,573 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ఎలక్ట్రానిక్స్ పరికరాలతో ఈ డిజిటల్ స్టోర్ ప్రారంభమైంది.
PR

ప్రతీ వినియోగదారుడిని సంతృప్తిపరిచే తగ్గింపు ధరలతో యల్ఈడీ, యల్సీడీ టీవీల నుండి మొదలుకుని మొబైల్ ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, గృహోపకరణాలైన వాషింగ్ మెషీన్లు, రెఫ్రిజిరేటర్లు, మిక్సీలు, గ్రైండర్లు ఇలా అన్ని వర్గాల వినియోగదారులకు అందుబాటు ధరలతో రిలయన్స్ తమ డిజిటల్ స్టోర‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఒ బ్రెయిన్ బ్యేడ్ మాట్లాడుతూ రిలయన్స్ డిజిటల్ జాతీయ, అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ పరికరాలతో వినియోగదారులను నిరతరం సంతృప్తిపరుస్తూ ముందుకు వెళుతున్నదన్నారు.

రిలయన్స్ సంస్థ తాజాగా " మిషన్ హ్యపీనెస్ " పేరుతో ఓ వినూత్న కార్యక్రమంతో దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో షాపింగ్ చేసిన వినియోగదారులకు సంస్థ బహుమతులను అందజేస్తున్నట్లు తెలియజేశారు. రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో రూ.25,౦౦౦కు పైగా కొనుగోలు చేసిన వినియోగదారులకు ఉచితంగా ఓ బంగారు నాణాన్ని, రూ.7,౦౦౦కు పైగా కొనుగోలు చేసిన వినియోగదారులకు ఓ వెండి నాణాన్ని బహుమతిగా అందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలో ఓ విభాగమైన రిలయన్స్ డిజిటల్ అధునాతన ఎలక్ట్రానిక్స్ పరికరాలతో వినియోగదారులకు మరింత చేరువవుతూ సరికొత్త విధానాలతో వినియోగదారుల ఆదరాభిమానాలను అందుకుంటున్న సంస్థగా ముందంజలో పయనిస్తోంది.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu