Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్భిణీలకు ఆస్పత్రి ఖర్చులకు రూ.6 వేలు నగదు... మహిళా శిశు అభివృద్ధికి రూ.1.84 కోట్లు

కేంద్ర ఆర్థిక మంత్రి మహిళలపై కాస్త కనికరం చూపించారు. గర్భిణీలకు ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.6 వేల నగదును బదిలీ చేస్తామని తెలిపారు. అలాగే, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధికి రూ.1.84 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్

గర్భిణీలకు ఆస్పత్రి ఖర్చులకు రూ.6 వేలు నగదు... మహిళా శిశు అభివృద్ధికి రూ.1.84 కోట్లు
, బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (13:41 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి మహిళలపై కాస్త కనికరం చూపించారు. గర్భిణీలకు ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.6 వేల నగదును బదిలీ చేస్తామని తెలిపారు. అలాగే, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధికి రూ.1.84 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. 2017-18 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ఆయన బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఇందులో మహిళా, విద్యా, ఆర్థిక రంగాలకు జరిపిన కేటాయింపులను పరిశీలిస్తే... 
 
* మహిళా శిశు అభివృద్ధి కోసం 1.84 లక్షల కోట్లు కేటాయింపు.
* మహిళా సాధికారత కోసం రూ.500 కోట్లతో మహిళా శక్తి కేంద్రాలు. 
* గర్భిణీలకు ఆస్పత్రి ఖర్చులకు రూ.6 వేలు నగదు బదిలీ. 
* 2025 కల్లా టీబీ రహిత దేశం చేయడం లక్ష్యం. 
 
విద్యా రంగానికి.. 
* విద్యారంగం కోసం ప్రత్యేక డీటీహెచ్ ఛానెల్
* ప్రధాని మంత్రి కౌశల్ యోజన దేశంలోని 600 జిల్లాలకు విస్తరిస్తాం
* దేశ వ్యాప్తంగా 100 ఇండియా ఇంటర్నేషనల్ స్కిల్ కేంద్రాల ఏర్పాటు
* రూ.4 వేల కోట్లతో నైపుణ్యాభివృద్ధి సంకల్ప నిధి
* నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఐటీఐల అనుసంధానం
* సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ కోసం ఫండ్ ఏర్పాటు
 
ఆర్థిక రంగం కేటాయింపులు... 
* సంకల్ప్ కార్యక్రమం ద్వారా 3.5 కోట్ల మంది యువతకు శిక్షణ
* ముద్రా రుణాల కోసం రూ. 2 లక్షల 44 వేల కోట్లు
* 250 ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పాదక కేంద్రాలు
* ఎలక్ట్రానిక్ ఉత్పాదక కేంద్రాల కోసం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి
* 20 వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు
* ప్రభుత్వ రంగ సంస్థలను స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేసేందుకు విలువ నిర్ధారణ కమిటీ ఏర్పాటు
* త్వరలో ఆధార్ అనుసంధానిత చెల్లింపుల వ్యవస్థ
* రూ.కోటి 25 లక్షల మంది బీమ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు
* 500 కోట్ల మంది నగదు రహిత లావాదేవీలు జరపాలన్నది లక్ష్యం
* బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్ కోసం రూ.10 వేల కోట్లు
* బీమ్ యాప్ ప్రోత్సాహం కోసం రెండు కొత్త పథకాలు
* సామాన్యుడికి ప్రయోజనం కలిగేలా నగదు రహిత చెల్లింపు వ్యవస్థ
* 2020 నాటికి 20 లక్షల ఆధార్ ఆధారిత స్వైప్ మిషన్లు
* ఆర్బీఐలో చెల్లింపుల నియంత్రణ బోర్డు
* రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిపోయిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కొత్త చట్టం. 
 
పేదలు, అణగారిన వర్గాలు కోసం.. 
* వెనుకబడిన కులాల సంక్షేమానికి రూ.52,393 కోట్లు
* గిరిజనులకు రూ.31,920 కోట్లు
* మైనార్టీలకు రూ.4,195 కోట్లు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడ్జెట్ 2017-18 : మొత్తం రూ.21.47 లక్షల కోట్లు... రక్షణ రంగానికి రూ.2.74 లక్షల కోట్లు.. రైల్వేకు ఎంత?