బడ్జెట్ 2017 అంచనాలు... ప్రజలకు మోదీ అతిపెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారా...? ఏంటది?
నోట్ల రద్దుతో భారీగా కోట్లలో డబ్బు బ్యాంకులో జమ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆదాయపన్ను శ్లాబ్స్ పెంచుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సాధారణ ఆదాయపన్ను పరిధిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకూ చేస్తారని అంచనా. అలాగే ప్రస్తుతం రూ.2.5లక్షలు నుం
నోట్ల రద్దుతో భారీగా కోట్లలో డబ్బు బ్యాంకులో జమ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆదాయపన్ను శ్లాబ్స్ పెంచుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సాధారణ ఆదాయపన్ను పరిధిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకూ చేస్తారని అంచనా. అలాగే ప్రస్తుతం రూ.2.5లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ 10 శాతం పన్ను విధిస్తున్నారు. దీనిని రూ.3 లక్షల నుంచి రూ. 10 లక్షలు చేస్తారని అంచనా.
అలాగే ప్రస్తుతం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ 20 శాతం పన్ను విధిస్తున్నారు. దీనిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచి దానిపై 20 శాతం పన్ను విధిస్తారని అంచనా.
అలాగే ప్రస్తుతం రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువున్న ఆదాయంపైన 30 శాతం పన్ను విధిస్తున్నారు. దీని పరిధిని రూ.20 లక్షలు ఆపై ఆదాయం వున్నవారికి 30 శాతం విధిస్తారని అంచనా. ఇదే జరిగితే మధ్యతరగతి ప్రజలకు మోదీ సర్కార్ ఇచ్చే అతిగొప్ప బహుమతిగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా పన్ను చెల్లించేవారికి రూ. 1,55,000 మేర లబ్ది పొందుతారు. ఈ డబ్బును వారు పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.