Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నల్లధనంపై యుద్ధం ప్రకటించాం... నగదు రహిత విధానానికి బాటలు వేశాం : అరుణ్ జైట్లీ

నల్లధనంపై యుద్ధం ప్రకటించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అదేసమయంలో నగదు రహిత చెల్లింపులకు బాటలు వేసినట్టు ఆయన తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం లోక్‌సభ ప్రారంభం కా

నల్లధనంపై యుద్ధం ప్రకటించాం... నగదు రహిత విధానానికి బాటలు వేశాం : అరుణ్ జైట్లీ
, బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (11:35 IST)
నల్లధనంపై యుద్ధం ప్రకటించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అదేసమయంలో నగదు రహిత చెల్లింపులకు బాటలు వేసినట్టు ఆయన తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం లోక్‌సభ ప్రారంభం కాగానే సిట్టింగ్ ఎంపీ ఈ. అహ్మద్ మృతి పట్ల సంతాపం ప్రకటించింది. స్పీకర్ సుమిత్ర మహాజన్ సభను ప్రారంభిస్తూ అహ్మద్‌కు నివాళులర్పించారు. అహ్మద్ ఐదుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారని తెలిపారు. ఆయన గౌరవార్థం గురువారం సభ సమావేశాలు జరగబోవని ప్రకటించారు. 
 
దీనికి విపక్షమైన కాంగ్రెస్ అడ్డుతగిలింది. కాంగ్రెస్ నేత ఖర్గే మాట్లాడుతూ... సభను ఈరోజు వాయిదా వేసి, బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించారు. అదేసమయంలో ప్రతిపక్ష సభ్యులు కూడా ఖర్గేకు మద్దతుగా మాట్లాడారు. అయితే, ఆయన విజ్ఞప్తిని స్పీకర్ సుమిత్రా మహాజన్ తోసిపుచ్చారు. దీంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. అరుణ్ జైట్లీ జైట్లీ ప్రవేశపెడుతుండటం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 
 
జైట్లీ ప్రవేశపెడుతున్న 2017-18 వార్షిక బడ్జెట్‌లోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... బ్లాక్‌ మనీపై పోరాటం చేశాం, మా చర్యలకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు. పారదర్శకత, ఖచ్చితత్వాన్ని పాటించినట్టు తెలిపారు. గడిచిన రెండేళ్లుగా అహర్నిశలు కష్టపడుతున్నట్టు గుర్తు చేశారు. ప్రజలు మాపై ఎన్నో ఆశలు పెట్టుకుని, మమ్మల్ని గెలిపించారన్నారు.
 
రెండంకెల ద్రవ్యోల్బణం అమల్లోకి వచ్చిందని, ప్రజా ధనానికి మేము రక్షకులుగా ఉంటామని హామీ ఇచ్చారు. వృద్ధిరేటును ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పారదర్శకత, అవినీతి లేని సుపరిపాలన కోసం గట్టిగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే, గత చరిత్రకు భిన్నంగా సాధారణ బడ్జెట్‌తో కలిపి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం హిస్టారికల్ డేగా ఆయన వ్యాఖ్యానించారు. 
 
నల్లధనంపై యుద్ధం ప్రకటించి, పెద్దనోట్లను రద్దు చేసినట్టు తెలిపారు. వ్యవస్థీకృతంగా ఉన్న లోపభూయిష్ట విధానాలకు స్వస్తి చెప్పాం. పరోక్ష పన్నులపై పార్లమెంట్‌‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రపంచ జీడీపీ ఈ ఏడాది పెరుగుతుందని ఐఎమ్‌ఎఫ్‌ అంచనా వేసినట్టు చెప్పారు. 
 
సరైన నిర్ణయం ఎప్పటికీ విఫలం కాదని మహత్ముడి ఉద్బోధ. నోట్ల రద్దు అన్నిరకాలుగా మేలు చేసిందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ రెండు కీలక నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి తోడ్పుడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఆర్థిక ఏడాదిలో జీడీపీ పెరుగుతుంది, 2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీనియర్ ఉద్యోగి కోర్కె తీర్చలేదు.. సెక్యూరిటీ గార్డుతో హత్య చేయించాడు : ఇన్ఫోసిస్‌ టెక్కీ తండ్రి రాజు