బడ్జెట్ 2017, జంక్ ఫుడ్, తీపి పానీయాలపై పన్ను బాదుడు....
జంక్ ఫుడ్, తీయనైన పానీయాలనగానే అనారోగ్య సమస్యలు గుర్తుకువస్తాయి. వీటిని అదుపుచేసేందుకు ఈసారి కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పదార్థాలపై పన్ను బాదుడు చేస్తే కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. జీవన విధానాన్ని తీవ్రంగా ప
జంక్ ఫుడ్, తీయనైన పానీయాలనగానే అనారోగ్య సమస్యలు గుర్తుకువస్తాయి. వీటిని అదుపుచేసేందుకు ఈసారి కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పదార్థాలపై పన్ను బాదుడు చేస్తే కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావం చేస్తూ అధిక బరువు, స్థూలకాయం, మదుమేహం తదితర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న ఈ పదార్థాలపై పన్ను వడ్డింపు అధికస్థాయిలో వుండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు దేశంలోని ఆరోగ్య సంరక్షణ సంస్థలు తమ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచినట్లు సమాచారం. 11 మంది సభ్యుల బృందం సూచనలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వారి సిఫారసులను ఆమోదిస్తే జంక్ ఫుడ్ కు రంగు పడటం ఖాయం. తీపి పానీయాలకు కూడా వడ్డింపు తప్పదు.