Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'కృషి కళ్యాణ్' పేరుతో పన్ను... ఫోనులో మాట్లాడినా.. ప్రయాణం చేసినా బాదుడే!

బడ్జెట్ 2016 ముఖ్యాంశాలు, కృషి కళ్యాణ్ కొత్త బాదుడు

Advertiesment
#Budget 2016
, సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (14:50 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం 'కృషి కళ్యాణ్' పేరుతో ప్రజలపై పన్నుభారం మోపేందుకు సిద్ధమైంది. దీనికితోడు ప్రస్తుతం వసూలు చేస్తున్న స్వచ్ఛ భారత్ సేవా పన్నును మరో 0.5 శాతం పెంచింది. దీంతో ఎడ్యుకేషన్ సెస్‌తో కలిపి 14.5 శాతానికి పెరిగింది. మరోవైపు కృషి కళ్యాణ్ పేరుతో మరో పన్నును కేంద్రం వసూలు చేయనుంది. ఇది జూన్ ఒకటో తేదీ నుంచి అమలు చేయనుంది. దీంతో దేశ ప్రజలపై అదనపు భారం పడనుంది. 
 
ముఖ్యంగా వ్యాపార ప్రకటనలు, విమాన ప్రయాణాలు, ఆర్కిటెక్ట్ సేవలు, గృహ నిర్మాణం, క్రెడిట్ కార్డుల వాడకం, ఈవెంట్ మేనేజ్మెంట్ తదితర సేవలు భారం కానున్నాయి. దీంతో పాటు టెలికం రంగం నుంచి అందుకునే సేవలపైనా భారం పడనుంది. మాట్లాడే ఫోన్ కాల్స్‌కు అధిక బిల్లులు ఇచ్చుకోవాలి. హోటల్స్ బిల్లులు భారం కానున్నాయి. దాదాపు అన్ని రకాల సేవలపైనా ఈ కొత్త పన్నుల భారం పడనుంది. కేవలం వైద్య సేవల రంగం వంటి అతి కొద్ది విభాగాలకు మాత్రమే ఈ కొత్త పన్ను భారం నుంచి మినహాయింపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu